Minister Anil: నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తికి తెలియదా? చంద్రబాబుపై అనిల్ ఆగ్రహం!

నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓట్లు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.

Minister Anil: నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తికి తెలియదా? చంద్రబాబుపై అనిల్ ఆగ్రహం!

Anil

Minister Anil: నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓట్లు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం వేళ నువ్వా? నేనా? అన్నట్టు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.

ఈ క్రమంలోనే జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలుగుదేశం పార్టీ నేతలను చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నేతల మాటలు నమ్మొద్దని, వారు చేసేదంతా దుష్ప్రచారమేనని, నెల్లూరు టీడీపీ నేత శ్రీనివాసులు ఒక రౌడీ షీటర్ అని అన్నారు.

ఎన్నికలు సజావుగా జరగడం కోసం రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం మామూలేనని, ఎన్నికల ప్రక్రియలో భాగంగానే శ్రీనివాసులుకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పారు అనిల్. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి ఈ మాత్రం తెలియదా? అని ప్రశ్నించారు.

శ్రీనివాసులుకు ఏదైనా జరిగితే మంత్రి అనిల్‌దే బాధ్యత అని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని, ఒక మర్డరిస్ట్‌ను వార్డు ఇంచార్జ్‌గా చెప్పుకోవడానికి చంద్రబాబుకి సిగ్గుండాలన్నారు. నేను ఎవరినీ బెదిరించలేదు.. ఎలాంటి అరాచకాలు సృష్టించలేదు.. టీడీపీ నాయకులే, చిల్లరగా సింపతీ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిల్.