బాబు ద్రోహి : ప్రజాస్వామ్యం బతికిందా ? ఖూని అయ్యిందా ? – మంత్రి అవంతి

  • Published By: madhu ,Published On : March 15, 2020 / 01:21 PM IST
బాబు ద్రోహి : ప్రజాస్వామ్యం బతికిందా ? ఖూని అయ్యిందా ? – మంత్రి అవంతి

ప్రజాస్వామ్యం బతికిందా ఖూని అయ్యిందా ? దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం..ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా..వాయిదా వేయడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ సీరియస్‌గా పరిగణిస్తోంది. బాబు కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. 2020, మార్చి 15వ తేదీ ఆదివారం వైసీపీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ…

కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయా ? సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారా ? సమాధానం చెప్పాల్సిన బాధ్యత CEO రమేశ్ కుమార్‌పై ఉందన్నారు. బాబు రాజకీయాలు స్టార్ట్ అయ్యింది…వెన్నుపోటు రాజకీయాలతోనని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదని, సొంత మామను వెన్నుపోటు పొడిచాడన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3 వేల కోట్లకు పైగా డబ్బులు రాకుండా అడ్డుకుంది..ద్రోహి బాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏది చెబితే..నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేయ్యడం దురదృష్టకరమని ఆరోపించారు. 

కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, అధికారులకు కనీసం చెప్పకుండా..ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని వైసీపీ ఖండిస్తోందన్నారు. ఆరు వారాల పాటు పోస్ట్ పోన్డ్ చేసినా..వైసీపీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోరుకొనే వారు దీనిని ఖండించాలని సూచించారు. ఎదుటి వాడి విజయాన్ని..ప్రోత్సాహించే అలవాటు బాబుకు లేదన్నారు. వైసీపీ విజయం స్పష్టంగా కనిపిస్తోందని, దీనిని చూసే తట్టుకోలేక..ఎన్నికలను పోస్టుపోన్డ్ చేయించారని ఆరోపించారు మంత్రి అవంతి.
Read More : కరోనా వైరస్ కాదు..క్యాస్ట్ వైరస్ వల్లే..ఎన్నికలు ఆపారు – అంబటి