Botsa Three Capitals : సీఎం ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు, 3 రాజధానులపై తగ్గేదే లేదు

ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళుతోందని,

Botsa Three Capitals : సీఎం ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు, 3 రాజధానులపై తగ్గేదే లేదు

Botsa Three Capitals

Botsa Three Capitals : ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళుతోందని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడం తథ్యమని చెప్పారు. 3 రాజధానుల అంశంలో వెనక్కి తగ్గేదే లేదని బొత్స స్పష్టం చేశారు.

మూడు రాజధానులపై రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని మంత్రి చెప్పారు. రాజధానులపై ఇప్పటికే చట్టం చేశామని, అది ఏ నిమిషాన అయినా అమలు కావొచ్చని అన్నారు. ఓ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పని చేయవచ్చని తెలిపారు. కోర్టులో ఉన్న కేసులకు, ముఖ్యమంత్రి పనిచేయడానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కోర్టుల్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బొత్స వివరించారు.

ఏపీ పరిపాలన రాజధాని విశాఖపై వైసీపీ నేతలు దూకుడు పెంచారు. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా హాట్ కామెంట్స్ చేశారు. పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని అన్నారు. సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. సీఆర్డీఏ చట్టానికి, మూడు రాజధానులకు సంబంధమే లేదన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తప్పకుండా వస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే దానికి సంబంధించిన డేట్ మాత్రం అడగొద్దన్నారు.

కార్యనిర్వాహక రాజధాని కానున్న విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపట్టిందని విజయసాయిరెడ్డి చెప్పారు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పరిధుల్లో పలు ప్రాజెక్టులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. విశాఖలో కైలాసగిరి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకూ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన జరుగుతోందన్నారు.