Petrol Prices : ఏపీలో పెట్రో ధరల తగ్గింపుపై మంత్రి కీలక ప్రకటన

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం స్పందించింది. ప్రజలకు స్పల్ప ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని..

Petrol Prices : ఏపీలో పెట్రో ధరల తగ్గింపుపై మంత్రి కీలక ప్రకటన

Petrol Prices

Petrol Prices : ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం స్పందించింది. ప్రజలకు స్పల్ప ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేసింది. దీంతో ఇంధన ధరలు తగ్గాయి. పలు రాష్ట్రాలు కేంద్రం బాటలో పయనించాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా తగ్గించాయి. దీంతో.. ఇప్పుడు తగ్గించని రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ కూడా ఒకటి.

ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గిస్తుండడంతో ఏపీలోనూ తగ్గించాలంటూ విపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు మేలు జరిగేలా మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు మంత్రి చెప్పారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం హర్షణీయం అన్నారు. దేశంలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చమురుపై పన్నులు తగ్గించడంతో ఇతర రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. కాగా, పెట్రో ధరలపై ఏపీ, తెలంగాణ తమ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం ఎంత మేరకు తగ్గిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. విజయవాడలో లీటరు పెట్రోల్‌ ధర రూ.110.35 కాగా.. డీజిల్‌ ధర రూ.96.44గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు రూ.108.20, డీజిల్‌ రూ.94.62 చొప్పున విక్రయిస్తున్నారు.

Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ

మరోవైపు పెట్రోల్ ధరలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఏపీలో పెట్రోల్ పై రూ.16, డీజిల్ పై రూ.17 వ్యాట్ త‌గ్గించి తీరాల‌ని చంద్ర‌బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈ నెల 9న అన్ని పెట్రోల్ బంకుల దగ్గర ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు.

మ‌ధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వ‌ర‌కు ఈ ఆందోళ‌న‌ల్లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గించే వ‌ర‌కు త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. అధికారంలోకి వ‌స్తే పెట్రోలు రేట్లు త‌గ్గిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పార‌ని, ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలున్న ఆంధ్రప్రదేశ్ లో వ్యాట్ తగ్గించాలన్నది టీడీపీ ప్రధాన డిమాండ్.