Gudivada Amarnath On Capital : రాజధాని ఎంపికలో రాష్ట్రానిదే తుది నిర్ణయం, అందుకే సుప్రీంకోర్టుకు-మంత్రి గుడివాడ అమర్నాథ్

రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని మంత్రి స్పష్టం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం అనే అంశాన్ని పిటిషన్ లో ప్రస్తావించామన్నారు.

Gudivada Amarnath On Capital : రాజధాని ఎంపికలో రాష్ట్రానిదే తుది నిర్ణయం, అందుకే సుప్రీంకోర్టుకు-మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath On Capital : రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఏపీకి ఒక్కటే రాజధాని, అదీ అమరావతే అని టీడీపీ అంటుంటే.. ఒక్కటి కాదు మూడు రాజధానులు ఉండాల్సిందేనని అధికార వైసీపీ అంటోంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు ఉండాల్సిందేనని జగన్ సర్కార్ చెబుతోంది.

తాజాగా.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం పట్ల రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని మంత్రి స్పష్టం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం అనే అంశాన్ని పిటిషన్ లో ప్రస్తావించామన్నారు.

వికేంద్రీకరణపై రాష్ట్రం చేసిన చట్టం చెల్లదన్న హైకోర్టు నిర్ణయాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం దృష్టి తీసుకెళ్లామని అమర్నాథ్ వివరించారు. రాజధానిపై నిర్ణయం తీసుకునే అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని రాజ్యాంగం చెబుతోందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఏపీలో మూడు రాజధానులకు న్యాయపరమైన అనుమతులు పొందే దిశగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తొలి అడుగు అని గుడివాడ అమర్ నాథ్ అభివర్ణించారు.

అధికార వికేంద్రీకరణకు బలం చేకూర్చే విధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని మంత్రి తెలిపారు. వికేంద్రీకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి అన్నారు. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని రాజ్యాంగం చెబుతోందని మంత్రి వెల్లడించారు.

”మా ప్రభుత్వం వికేంద్రీకరణకే కట్టుబడి ఉంది. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే లక్ష్యం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. ఆర్టికల్ 3,4 ప్రకారం రాష్ట్ర విభజన జరిగింది. రాజధాని ఎంపికలో రాష్ట్రానిదే తుది నిర్ణయం. రాష్ట్రాధికారానికి భంగం కలిగించేలా ఉన్న తీర్పుపై సవాల్ చేశాం. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం కూడా చెప్పింది.

విభజన చట్టం సెక్షన్-6 ప్రకారం నియమితులైన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వక ముందే అమరావతిని అప్పటి ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. నారాయణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అమరావతిని ప్రకటిస్తే అది ప్రభుత్వానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాం. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న తర్వాత హైకోర్టు తీర్పు వచ్చింది. అదే విషయాన్ని సుప్రీం కోర్టుకు చెప్పాం” అని మంత్రి అమర్నాథ్ అన్నారు.