Minister Jogi Ramesh : పేదలకు ఇళ్లు ఇస్తుంటే టీడీపీ అడ్డుకోవడం దుర్మార్గం : మంత్రి జోగి రమేశ్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు నివసిస్తే అంటరానితనం అంటూ అడ్డుకుంటారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా..? అని మండిపడ్డారు.

Minister Jogi Ramesh : పేదలకు ఇళ్లు ఇస్తుంటే టీడీపీ అడ్డుకోవడం దుర్మార్గం : మంత్రి జోగి రమేశ్

Jogi Ramesh - Chandrababu

Jogi Ramesh criticize Chandrababu : పేదలకు ఇల్లు ఇస్తుంటే టీడీపీ అడ్డుకోవడం దుర్మార్గమని మంత్రి జోగి రమేశ్ అన్నారు. పేదలకు ఇల్లు ఇవ్వద్దని పోరాటం చేస్తున్న ఏకైన పార్టీ టీడీపీ అని విమర్శించారు. టీడీపీ.. పేదల వైపు కాకుండా పెత్తందారుల వైపు పోరాటం చేసిందని ఆరోపించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అడ్డుకోవాలని చూశారని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వమే పోరాటం చేయాల్సివచ్చిందన్నారు. ఈ మేరకు గురువారం మంత్రి జోగి రమేష్ అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పేదలను గెలిపించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు నివసిస్తే అంటరానితనం అంటూ అడ్డుకుంటారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా..? అని మండిపడ్డారు. పేదలు పనులకు మాత్రమే ఉపయోగపడాలా? అక్కడ నివసించకూడదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు నయా జమీందారీ వ్యవస్థ తీసుకురావాలని చూస్తున్నాడని ఆరోపించారు.

GVL Narsimha Rao : వైసీపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ పోరాటం : జీవీఎల్ నర్సింహారావు

శుక్రవారం అమరావతిలో 50 వేల మంది పేదలకు సీఎం జగన్ ఇళ్ళ పట్టాల పంపిణీ చేస్తారని మంత్రి జోగి రమేశ్ తెలిపారు.  పట్టాలు ఇస్తుంటే వద్దని కొందరు మహిళా పెత్తందార్లను అడ్డుకోమంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అమరావతి పెత్తందారులు చంద్రబాబును వదిలిపెట్టాలని హితవుపలికారు.

జగన్ ను నమ్ముకోండి.. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోకండి అంటూ సూచించారు. అమరావతి పెత్తందారులు కొంచెం బుర్ర పెట్టీ ఆలోచించాలన్నారు. ‘చంద్రబాబు కులం అయినంత మాత్రాన ఇంకెవరూ మీ ప్రాంతంలో ఉండకూడదా..? మేమే బాగుండాలి అనుకోకండి.. అందరూ బాగుండాలి అనుకోండి’ అని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఈ పేదలే టీడీపీకి సమాధి కడతారని.. చంద్రబాబు పెత్తందారీ కోటను బద్దలుగొట్టబోతున్నారని పేర్కొన్నారు.

Jogi Ramesh : చంద్రబాబు.. నేను రెడీగా ఉన్నా, మీరు రెడీయా? : మంత్రి జోగి రమేశ్

పట్టాల పంపిణీ అడ్డుకుంటామని పిలుపు ఇచ్చిన జేఏసీకి బుద్ధి ఉందా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పనికిమాలిన పెత్తందారులు, జేఏసీని తరిమి కొడతామని హెచ్చరించారు. జేఏసీ చేసేదేంటని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు వద్దని జేఏసీ ఉద్యమం చేస్తుందని మండిపడ్డారు.
మరోవైపు సీఆర్డీఏ పరిధిలో ఆర్ 5 జోన్ లో పేదలకు శుక్రవారం ఇళ్ల పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

రాజధాని ప్రాతంలోని వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి శుక్రవారం సీఎం జగన్ చేతుల మీదుగా లాంఛనంగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సీఎం జగన్ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కరకట్టపై పెద్ద ఎత్తున సీఎం జగన్ కు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేశ్, టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్, వైసీపీ నాయకులు, అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.

Minister Jogi Ramesh Comments : చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల్లోని 50,790 మంది లబ్ధిదారులకు ఆర్ 5 జోన్ లో 25 లే అవుట్లలో ప్రభుత్వం పట్టాల పంపిణీ చేయనుంది. సీఆర్డీఏ పరిధిలోని 8 టిడ్కో లే అవుట్ల పరిధిలోని 5,024 టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు హక్కు పత్రాల పంపిణీని సీఎం జగన్ లాంఛనంగా చేయనున్నారు.