అమరావతి కోసం రాజీనామా చేస్తారా మంత్రి కొడాలి నాని సవాల్

  • Published By: madhu ,Published On : January 20, 2020 / 11:16 AM IST
అమరావతి కోసం రాజీనామా చేస్తారా మంత్రి కొడాలి నాని సవాల్

అమరావతే రాజధాని కావాలని ప్రజలు కోరుతున్నట్లు చెబుతున్న టీడీపీ సభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని ఏపీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని స్ట్రాంగ్‌గా నమ్మితే..బాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి గెలవాలని సభలో వెల్లడించారు. రాధాని ఎక్కడుంటే ఏంటీ ? అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి సంపద తెస్తుందా ? లేదా ? అన్నదే చూడాలన్నారు. రాజధాని ఢిల్లీ దేశానికి మధ్యలో ఉందా ? దేశ రాజధానిగా ఢిల్లీని కన్యాకుమారి ప్రజలు అంగీకరించలేదా అని ప్రశ్నించారు. అమరావతి పుణ్యక్షేత్రమని బాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజులు, బౌద్ధులు పరిపాలించిన అమరావతిని బాబు పాతిపెట్టారని వివరించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల గురించి బాబుకు ఆలోచన ఉందా అని సభ సాక్షిగా ప్రశ్నించారు.

ఒక కులంపై ధ్వేషంతో రాజధానిని తరలించడం లేదని వివరించారు. రాజధానికి రూ. లక్ష కోట్లు ఖర్చు పెడితే..మిగతా పథకాల సంగతేంటి ? పొలాలు అమ్మి రాజధాని నిర్మించడం సాధ్యమేనా మంత్రి కొడాలి ప్రశ్నించారు. ప్రజలు చాలా తెలివైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కావాలనే టీడీపీ ప్రభుత్వంపై, వైఎస్ ఫ్యామిలీపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కొడుకుని కూడా గెలిపించుకోలేని దుస్థితిలో బాబు టీడీపీ ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. 

* అమరావతి ఒక మోసం.
* రాజుల కాలం నాటి అమరావతిని పాడు పెట్టారు..ఇప్పుడున్నది బాబు అమరావతి. 
 

* అభివృద్ధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎప్పుడూ మొదటి స్థానాల్లో ఉన్నాయి. 
* జనాలను రెచ్చగొడితేనో..జోలె పడితేనో..ప్రజలు సానుభూతి చూపించరు.
* విజన్ 2020 అన్నారు..బాబుకు ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. 

Read More : లోకేష్ ట్వీట్ : సభలో జగన్‌కు ఎలా నిద్ర పడుతోంది ?