లారీ డ్రైవర్‌నే, ఉమ సోడాలు అమ్మలేదా: డైరెక్ట్‌‍గా మాట్లాడదామని కాల్ చేస్తే ఉమ ఎత్తడం లేదు… కొడాలి నాని ఫైర్

  • Published By: madhu ,Published On : September 4, 2020 / 02:00 PM IST
లారీ డ్రైవర్‌నే, ఉమ సోడాలు అమ్మలేదా: డైరెక్ట్‌‍గా మాట్లాడదామని కాల్ చేస్తే ఉమ ఎత్తడం లేదు… కొడాలి నాని ఫైర్

లారీ డ్రైవర్‌నే, ఉమ సోడాలు అమ్మలేదా ? డైరెక్ట్‌‍గా మాట్లాడదామని కాల్ చేస్తే ఉమ ఎత్తడం లేదంటూ ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకంపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2020, సెప్టెంబర్ 04వ తేదీ శుక్రవారం మంత్రి కొడాలి నాని మీడియా సమావేశం నిర్వహించారు.

ఉచిత విద్యుత్ పై విమర్శలు చేస్తున్న టీడీపీ పార్టీపై, దేవినేని ఉమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కాదు…ఎన్టీయార్ ఫ్యామిలీ, వైఎస్సార్ ఫ్యామిలీ అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చెదెప్పుడు ? ఎప్పుడు కక్ష తీసుకుంటారని ప్రతిపక్ష పార్టీ టీడీపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.




జగన్ వల్లే మంత్రిగా ఉన్నట్లు, అంతరిక్షం నుంచి వచ్చినట్లు బాబు విజయవాడకు వచ్చారని ఎద్దేవా చేశారు. దోమల మీద దండయాత్ర చేశావ్… కరోనా మీద ఎందుకు చేయవని ప్రశ్నించారాయన. దేవినేని ఉమ మీద మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. ఉమ అంతరిక్షం నుండి వచ్చిన వాడిలా ఉంటాడని ఎద్దేవా చేశారు. నన్ను లారీ డ్రైవర్, బస్ క్లీనర్ అంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.

నువ్వేమీ మైసూర్ మహారాజువా? నువ్వు సోడాలు అమ్మలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. క్రాంతి కూల్ డ్రింక్ షాపు నీదేనని అందరికీ తెలుసున్నారు. వదినను చంపి రాజకీయాల్లోకి వచ్చావని ఘాటు ఆరోపణలు గుప్పించారు.




లారీ డ్రైవర్, క్లీనర్ గురించి పదే పదే మాట్లాడుతున్నాడు..కోపంతో ఇబ్రహింపట్నం దగ్గరో, గొప్పపూడి దగ్గరో లారీని ఎక్కించేస్తే ఉమ అప్పడం అవుతాడని, లారీ డ్రైవర్లు, క్లీనర్ల గురించి మాట్లాడొద్దని మంత్రి కొడాలి సూచించారు.