Kodali Nani : చంద్రబాబు గజమోసగాడు.. రాష్ట్రంలో ఎక్కడైనా గెలుపు మాదే

డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని మంత్రి ఎద్దేవా చేశారు

Kodali Nani : చంద్రబాబు గజమోసగాడు.. రాష్ట్రంలో ఎక్కడైనా గెలుపు మాదే

Kodali Nani

Kodali Nani : ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర అంటూ నిప్పులు చెరిగారు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని మంత్రి ఎద్దేవా చేశారు. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతాడన్న మంత్రి కొడాలి నాని 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను చంద్రబాబు అడ్డం పెట్టుకున్నాడని మండిపడ్డారు.

Samantha : సినిమా చేయాలంటే కొత్త కండిషన్లు పెడుతున్న సమంత.. విడాకుల ఎఫెక్ట్?

”చాలామంది టీడీపీ నేతలు వైసీపీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. వైసీపీ అంటే టీడీపీ కంటే బలమైన మాస్‌ ఇమేజ్‌ ఉన్న శక్తివంతమైన పార్టీ. పులివెందుల అయినా.. కుప్పమైనా.. గుడివాడైనా.. మైలవరమైనా.. మరెక్కడైనా.. వైసీపీ జెండానే ఎగురుతుంది” అని మంత్రి కొడాలి నాని చెపపారు.

”ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు. మళ్లీ అధికారంలోకి రావాలని రాజకీయ నిరుద్యోగులు కొందరు పర్యటనలు చేస్తున్నారు. దేవినేని ఉమ జిల్లాలో తిరిగి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. దేవినేని ఉమ కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి అధికారం శాశ్వతం కాదని అధికారులకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకోసారి అధికారులను బెదిరిస్తే కేసులు పెట్టండి” అని ఉద్యోగులతో చెప్పారు కొడాలి నాని.

Android Phones Hack: మీ ఫోన్‌లో వైరస్ ఇలా గుర్తించండి.. వెంటనే తీసేయండి..!

చంద్రబాబు మాట తప్పి మోసం చేస్తే, సీఎం జగన్ మాత్రం… ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నా డ్వాక్రా మహిళలకు రూ.13 వేల కోట్లతో రెండు దఫాలుగా అందించారని మంత్రి కొడాలి నాని అన్నారు.

వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం స్వగ్రామం గొల్లపూడిలో ఆదివారం నిర్వహించారు. దీనికి మంత్రి కొడాలి నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి పేర్నినేని, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటక‌ృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే జోగి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.