Kodali Nani : చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, కాళ్ల దగ్గర కూర్చుంటా

చంద్రబాబుకు దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయాలి. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. చంద్రబాబు బూట్లు తుడుస్తా. ఆయన కాళ్ల దగ్గర..

10TV Telugu News

Kodali Nani : టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, చౌకబారు మాటలు అంటున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని మాట్లాడారు. జడ్పీటీసీల్లో 99 శాతం, ఎంపీటీసీల్లో 85 శాతం వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారని వెల్లడించారు. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరులోనూ వైసీపీదే విజయం అని స్పష్టం చేశారు.

Apple iPhone: భారీ తగ్గింపు ధరలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఐఫోన్‌లు

రెండున్నరేళ్ల తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు లేవనే విషయాన్ని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని మంత్రి అన్నారు. నగరాలు మొదలుకుని గ్రామాల ద్వారా అన్ని స్థాయిల్లో కూడా ప్రజలు తమ ప్రభుత్వానికి అండగా నిలిచారని, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ-ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు.

IT Recruitment : ఐటీలో 15,000 ఉద్యోగాలు

జగన్ ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని కొడాలి నాని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉండదని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని నాని డిమాండ్ చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, చంద్రబాబు బూట్లు తుడుస్తానని, ఆయన కాళ్ల దగ్గర కూర్చుంటానని నాని ఛాలెంజ్ చేశారు.

ఓటమిని ముందే ఊహించిన చంద్రబాబు.. మూడు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండగా కుట్రలు పన్ని అప్పటి ఎన్నికల కమిషనర్‌తో వాయిదా వేయించి పారిపోయారని అన్నారు. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చాక మార్చిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే.. టీడీపీకి భంగపాటు తప్పదని తెలిసి లెక్కింపు ఆపేశారని విమర్శించారు. ఫలితాలు వెలువడటంలో జాప్యం చోటు చేసుకుందే తప్ప.. విజయంలో మాత్రం తేడా ఏమీ లేదని కొడాలి నాని అన్నారు. టీడీపీ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తే.. ఆ పార్టీ తరఫున 800 నుంచి 900 మంది అభ్యర్థులు గెలిచారని.. వాళ్లందరూ చంద్రబాబుని ధిక్కరించిన వాళ్లా? అని సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబు దిక్కుమాలిన, పనికి మాలిన నాయకుడు కావడం వల్లే ఆయన ఎన్నికలను బహిష్కరించినా.. వారంతా పోటీ చేసి, గెలిచారా? అని అన్నారు. చంద్రబాబు ఎన్నికల పోరు నుంచి పారిపోతే.. ఆ పార్టీ తరఫున గెలిచిన వారు ధైర్యంగా పోటీ చేశారని చెప్పారు. ఆ గెలిచిన ఎంపీటీసీల నుంచో లేదా జెడ్పీటీసీల నుంచో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని కొడాలి నాని సూచించారు. పారిపోయే చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిగా తొలగించి.. ధైర్యంగా ఎన్నికల పోరాటంలో నిలిచి, గెలిచిన వారిని నియమించుకోవాలని అన్నారు.

తమ పార్టీ అధినేత, సీఎం జగన్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదని కొడాలి నాని గుర్తు చేశారు. అడుగు బయట పెట్టకుండా పార్టీకి 90 శాతానికి పైగా ప్రజలు ఓటు వేసేలా.. పరిపాలనను సాగిస్తున్నారని చెప్పారు. జగన్ పాలన జనరంజకంగా సాగుతోందనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదన్నారు. వైఎస్ జగన్‌ను ప్రజలు మనస్ఫూర్తిగా దీవిస్తున్నారని, అది చూసి సహించలేకే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ పేరుతో నాటకాలు ఆడారని మండిపడ్డారు.