Kodali Nani : మంత్రి పదవి నుంచి నన్ను తప్పించాలని చంద్రబాబు కుట్ర – కొడాలి నాని
టీడీపీ నిజనిర్ధారణ కమిటీపైనా కొడాలి నాని ఫైర్ అయ్యారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, మర్డర్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు నిజనిర్ధారణ కమిటీ సభ్యులా? అని నిప్పులు చెరిగారు.

Kodali Nani : గుడివాడ కాసినో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కాసినో మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. సై అంటే సై అంటున్నారు వైసీపీ, టీడీపీ నాయకులు. తేల్చుకుందాం రా, కొట్టుకుందాం రా.. అని సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. మంత్రి కొడాలి నానిని టీడీపీ టార్గెట్ చేసింది. కొడాలి నాని గుడివాడను గోవాలాగా మార్చేశారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు.. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ చేస్తున్న ఆరోపణలు, తాజా పరిణామాలపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. మంత్రి పదవి నుంచి నన్ను తప్పించాలన్నదే చంద్రబాబు ప్రయత్నం అని కొడాలి నాని అన్నారు. కే కన్వెన్షన్ లో క్యాసినో జరిగినట్లు నిరూపించాల్సిందే అన్నారు కొడాలి నాని. చెత్త కాగితాలు తెచ్చి ఇదిగో ఆధారం అంటే ఎలా? అని ప్రశ్నించారు. కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉంటే నన్ను టార్గెట్ చేశారని మండిపడ్డారు.
Watching TV : అధిక సమయం టీవీ చూసే అలవాటుందా?… అయితే జాగ్రత్త?
టీడీపీ నిజనిర్ధారణ కమిటీపైనా కొడాలి నాని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, మర్డర్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు నిజనిర్ధారణ కమిటీ సభ్యులా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్న చంద్రబాబు వంటి వ్యక్తి విపక్షనేతగా ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని వ్యాఖ్యానించారు.
గుడివాడలోని తన కే కన్వెన్షన్ లో కేసినో జరిగిందంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్న చంద్రబాబు వంటి వ్యక్తి విపక్షనేతగా ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అన్నారు. నిజం నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరితే, కే కన్వెన్షన్ సమీపంలో జరిగిందంటూ టీడీపీ 420 గాళ్లు మాటమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కే కన్వెన్షన్ సెంటర్ సమీపంలో అని కాకుండా, గుడివాడలో జరిగిందంటున్నారని వెల్లడించారు. తాను ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉంటే తనపై ఇష్టం వచ్చినట్టు రాద్ధాంతం చేశారని ధ్వజమెత్తారు.
420 గాళ్లు, మర్డర్ కేసులో ఉన్న వాళ్లు, ఒళ్లు అమ్ముకునే వాళ్ల దగ్గర కూడా డబ్బులు కొట్టేసినవాడు, కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో ఉన్నవాళ్లు… వీళ్లు నిజనిర్ధారణ కమిటీలో సభ్యులు.. అంటూ ఎద్దేవా చేశారు. వీళ్లను ప్రజలు రాజకీయ సమాధి చేసి రెండున్నరేళ్లు అయిందన్నారు. వచ్చే ఎన్నికలు కాదు కదా, సమీప భవిష్యత్తులో టీడీపీ గెలిచేది లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. 2024 కాదు 2034 వరకు టైమిస్తున్నా… గెలిచి చూపించండి అంటూ సవాల్ విసిరారు.
Paneer : బరువు నియంత్రణకు దోహదపడే పన్నీర్..!
టీడీపీ నేతలు డీజీపీపై పడి ఏడుస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఆయన విజయవాడ కమిషనర్ గా చేశారని… ఈ బుద్ధా వెంకన్న, బోండా ఉమ ఎలాంటివాళ్లో ఆయనకు బాగా తెలుసన్నారు. బుద్ధా వెంకన్న ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని, పిచ్చివాగుడు వాగితే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి కొడాలి నాని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
కాసినో వివాదంపై గన్నవరం ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని సన్నిహితుడు వల్లభనేని వంశీ కూడా తీవ్రంగా స్పందించారు. సంక్రాంతికి.. కోడి పందాలు, జూదం జరుగుతూనే ఉంటాయని, అది చాలా కామన్ అన్నట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్టే కృష్ణా జిల్లా గుడివాడలోనూ జరిగాయని వివరించారు. అయితే, టీడీపీ కావాలని రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనూ అలాంటివి అక్కడ జరిగాయని, వాటి నిర్వాహకులు టీడీపీకి చెందిన వారే అని, కొడాలి నానికి సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు వంశీ.
- TDP mahanadu: మహానాడు వేదికగా సమరశంఖం పూరించనున్న చంద్రబాబు.. నేటి కార్యక్రమాలు ఇలా..
- Chandrababu Naidu: “అప్పటి ప్రధాని వాజ్‌పేయి రావడం మరిచిపోలేని సంఘటన”
- Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు
- Chandrababu Letter To Stalin : ఏపీ రేషన్ రైస్ మాఫియా.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ
- వైసీపీని ఓడిద్దాం.. రాష్ట్రాన్ని బాగు చేద్దాం
1DRDO JOBS : దిల్లీలోని డీఆర్డీఓ ఆర్ఎసీలో ఖాళీల భర్తీ
2Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. వరుడు బంధువులు ఏం చేశారంటే..
3Minister Arvind Raiyani : ఇనుప గొలుసులతో కొట్టుకున్న బీజేపీ మంత్రి..కరెన్సీ నోట్లు చల్లిన అభిమానులు
4Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
5Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..
6Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
7Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
8US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..
9Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
10Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
-
Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!