Peddireddy Criticism Chandrababu : చంద్రబాబు ప్రజల మద్దతు కోల్పోయారు : మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజల మద్దతు కోల్పోయారని పేర్కొన్నారు.

Peddireddy Criticism Chandrababu : చంద్రబాబు ప్రజల మద్దతు కోల్పోయారు : మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy Ramachandrareddys Criticism Of Chandrababu

Minister Peddireddy criticism of Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజల మద్దతు కోల్పోయారని పేర్కొన్నారు. ప్రజలు టీడీపీ నేతలను తిరస్కరించారని తెలిపారు. అతి దారుణంగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. దేశంలో 51 శాతంపైగా ఒక పార్టీకి ఓట్లు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. చంద్రబాబు ఏదో ఒక సపోర్టు లేకుండా.. ఊత కర్ర లేకుండా నడవలేడని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తులలో అనైతికంగా మీ పార్టీలో చేర్చుకొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి, 23 మంది శాసన సభ్యులను చేర్చుకున్నారని ఆరోపించారు. తమ పార్టీలో గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మీ పార్టీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. వారిని కార్పొరేషన్ మేయర్లుగా, మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లుగా, జెడ్పీ చైర్ పర్సన్, ఎంపీపీలుగా ఎన్నుకున్నది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇన్ని చేసి ఇప్పుడు అబద్ధాన్ని నిజంగా మాట్లాడేగల్గేవారంతా కూడా పుంకానుపుంకాలుగా మీడియాలో చెబుతున్నారని పేర్కొన్నారు.

అనేక రకాల కంప్లైట్స్ ఇస్తున్నారని, ఢిల్లీలో మీ ఎంపీలు కంప్లైంట్స్ ఇస్తున్నారని, ఇక్కడ విజయవాడలో మీరు, మీ తరపున పోటీ చేసే వారు, వారి మద్దతుదారులు కంప్లైంట్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. అబద్ధాన్ని నిజం చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఎన్నికలు ఎందుకు రద్దు చేయాలని ప్రశ్నించారు. ఎన్నికలు రద్దు చేస్తే తమకు ఏమీ ఇబ్బంది లేదన్నారు. కానీ ఏమీ పొరపాటు జరిగిందని ఎన్నికలు రద్దు చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఎవరితో కలిసి పోటీ చేయమని తేల్చి చెప్పారు. ఇంతవరకు కలిసి పోటీ చేయలేదు…భవిష్యత్ లో కూడా చేయబోమని స్పష్టం చేశారు.