తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఏపీపై ఉండదు

తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

  • Published By: veegamteam ,Published On : November 7, 2019 / 02:44 PM IST
తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఏపీపై ఉండదు

తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. గురువారం (నవంబర్ 7, 2019) మీడియాతో చిట్‌చాట్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రభుత్వంలో విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందన్నారు. ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నారని తెలిపారు. కేంద్రం ప్రతినిధి కూడా ఆర్టీసీ విలీనానికి అంగీకరించారని చెప్పారు.

ఆర్టీసీ విభజన అంశం సాంకేతిక అంశం మాత్రమేనని అన్నారు. విలీనానికి ఇబ్బంది లేకుండా సాంకేతిక ఇబ్బందులు అధిగమిస్తామని చెప్పారు. విభజన జరుగలేదంటున్న కేంద్రం ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు నిధులు ఎలా కేటాయించిందని ప్రశ్నించారు.

మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి అంశాన్ని ప్రస్తావించగా.. రాజకీయంగా చివరి దశలో ఉన్న జేసీతో తమకేం పని.. ఆయనను వైసీపీలోకి ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించారు. బస్సుల సీజ్‌ విషయంలో జేసీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తుంద’ని వ్యాఖ్యానించారు.