Minister Perni Nani : ప్రభుత్వంపై చంద్రబాబు అనుకూల మీడియా తప్పుడు ప్రచారం- పేర్నినాని

ఔటర్ రింగ్ రోడ్డు కట్టాలంటే 8 వేల ఎకరాలు కావాలని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు చెందిన అనుకూల మీడియా ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన

Minister Perni Nani : ప్రభుత్వంపై చంద్రబాబు అనుకూల మీడియా తప్పుడు ప్రచారం- పేర్నినాని

Ap Minister Perni Nani

Minister Perni Nani :  ఔటర్ రింగ్ రోడ్డు కట్టాలంటే 8 వేల ఎకరాలు కావాలని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు చెందిన అనుకూల మీడియా ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.  ఓ.ఆర్.ఆర్.కి ఉరి… రాష్ట్ర అభివృద్ధికి విఘాతం అని ఒక పత్రికలో వచ్చిన వార్తపై ఆయన ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉనికిలో లేని ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఓ దినపత్రిక అబద్ధపు ప్రచారం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై 2016లో రిపోర్ట్‌ తయారు చేశారు. ముందుగా భూమిని సేకరించమని కేంద్రం స్పష్టం చేసింది. గూగుల్‌ మ్యాప్‌లో గీత గీసీ అదే ఔటర్‌ రింగ్‌రోడ్డని చెప్పారు. చంద్రబాబు కనీసం డీపీఆర్‌ కూడా తయారు చేయలేకపోయారు. ప్రభుత్వంపై బురదజల్లడానికి ఓఆర్‌ఆర్‌ను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.  జగన్ సీఎం అయ్యాక చిన్న అవుటపల్లి నుంచి చిన కాకాని వరక ఔటర్ రింగ్ రోడ్డు వేయిస్తున్నారని… చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో చిన్న ఫ్లై ఓవర్ కూడా కట్టలేకపోయారని అన్నారు.

రాజధాని రైతుల పాదయాత్ర కోసం చేసిన ఖర్చు అమరావతిలో ఒక రోడ్ కి అయినా ఖర్చు చేసి ఉండాల్సిందని ఆయన  విమర్శించారు. అమరావతిరాజధాని కాదని ఎవరూ అనలేదని… అమరావతి కూడా ఒక రాజధానే అని..శాసన రాజధాని అమరావతి అబివృద్ధి జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా జరుగుతుందని నాని చెప్పారు. అమరావతి పేరు తో చంద్రబాబు ఇంకా మోసం చేస్తున్నారని… జగన్ మనవాడు కాదు అనుకున్నా.. అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపాడు అని ఇక్కడ ప్రజలు అనుకునేలా జగన్ పాలన చేస్తారని మంత్రి తెలిపారు.
Also Read : Chandrababu Naidu : భావితరాల భవిష్యత్ కోసం ఒకే రాజధాని ఉండాలి
ఉక్కు ఫ్యాక్టరీ అమ్మవద్దు అని పవన్ కళ్యాణ్ మోడీ, అమిత్ షాకి చెప్పవచ్చు కదా అని ఆయన కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర ఒక సినిమా…. మంగళగిరి లో ఒక సినిమా అయిపోయింది.  పవన్ కళ్యాణ్ మాటలు విన్నవాళ్ళు…గాడిదలు ఎక్కిన వాళ్ళు ఒకటే అని నాని ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ చేసేది దగా… పచ్చి మోసం… పవన్ కళ్యాణ్ సినిమా ఉచితంగా చూపక్కర్లేదు… బ్లాక్ లో టికెట్లు అమ్మకుండా ఉంటే చాలని ఆయన అన్నారు.

జనసేన-టీడీపీ వాళ్ళు నిన్నటి వరకు చీకట్లో కలిసేవాళ్ళు…నిన్నటితో ఆ ముసుగు తొలగిపోయిందని నాని చెప్పారు. చేనేత పై కేంద్రం 5 నుంచి 12 పెంచిన GST తగ్గించాలి అని మంత్రి డిమాండ్ చేశారు. GST కౌన్సిల్ సమావేశంలో ఈవిషయం గట్టిగా చెబుతాం అని…. GST తగ్గించాలి అని ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ఇస్తున్నామని మంత్రి చెప్పారు.