Perni Nani on Vakeel Saab : వకీల్ సాబ్ పై మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్

జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నేడు(ఏప్రిల్ 9,2021) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడం రాజకీయ దుమారం రేపింది. దీనిపై జనసేన భాగస్వామ్య పక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వకీల్‌సాబ్‌ సినిమా బెనిఫిట్‌ షోలు ఎందుకు రద్దు చేశారంటూ తిరుపతి నగరంలోని జయశ్యామ్‌ థియేటర్‌ దగ్గర బీజేపీ శ్రేణులు నిరసన తెలిపాయి.

Perni Nani on Vakeel Saab : వకీల్ సాబ్ పై మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్

Perni Nani Vakeel Saab

Perni Nani Vakeel Saab : జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నేడు(ఏప్రిల్ 9,2021) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడం రాజకీయ దుమారం రేపింది. దీనిపై జనసేన భాగస్వామ్య పక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వకీల్‌సాబ్‌ సినిమా బెనిఫిట్‌ షోలు ఎందుకు రద్దు చేశారంటూ తిరుపతి నగరంలోని జయశ్యామ్‌ థియేటర్‌ దగ్గర బీజేపీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్‌ దేవ్‌ధర్‌.. పవన్‌కే కాకుండా ఆయన సినిమాకూ సీఎం జగన్‌ భయపడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో దేవ్‌ధర్‌కు పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు.

వకీల్ సాబ్ హిట్ కు, తిరుపతిలో బీజేపీ గెలుపునకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం 4 షోలకే అనుమతి ఉందని స్పష్టం చేశారు. టికెట్ రేట్లు పెంచి జనం జేబులు కొట్టాలా? అని మండిపడ్డారు. పవన్ సినిమా అయినంత మాత్రాన నిబంధనలు మార్చరన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు.

”ఎవరు ఎవర్ని దోచుకోవడానికి అనుమతివ్వాలి. బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో మీకు తెలుసా? సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారంగా నాలుగు షోలకే అనుమతి ఉంది. సినిమా టికెట్ ధర పెంచితే పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడే అవకాశం ఉంది. ఈ కారణంగానే బెనిఫిట్ షోలు రద్దు చేశాం” అని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన బీజేపీ, పవన్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఏపీకి ఏం చేశారని తిరుపతి ప్రజలు బీజేపీకి ఓటువేయాలి? ఏపీ ప్రజలను మోసం చేసినందుకే ఓటు వేయాలా? విభజన హామీలు అమలు చేయనందుకు ఓటు వేయాలా? ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు ఓటు వేయాలా?” అని మండిపడ్డారు.

“నాడు రాష్ట్రాన్ని రెండుగా చీల్చింది బీజేపీయేనని పవన్ అనలేదా? బీజేపీ ప్రభుత్వం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని పవన్ చెప్పలేదా” అని పేర్ని నాని నిలదీశారు. చేయి చాచి సాయం అడిగితే ఉమ్మేశారని పవనే ఆరోపించారని గుర్తుచేశారు. 2019 ఎన్నికల వరకు మోడీని, అమిత్ షాతో పాటు బీజేపీ నేతలను పవన్ దూషించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ మొదటి ద్రోహి అయితే, రెండో ద్రోహి బీజేపీ అని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను మంత్రి ప్రస్తావించారు.

నాడు తీవ్ర విమర్శలు చేసిన పవన్.. ఇప్పుడేమో బీజేపీకే ఓటు వేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ను విమర్శించిన విషయం ప్రజలెవరూ మర్చిపోలేదన్నారు. బీజేపీ, పవన్ మధ్య సంబంధాలను వ్యాపార ధృక్పథంతో చూస్తున్నారని మంత్రి చెప్పారు.