Minister Roja: రాష్ట్రానికి, టీడీపీకి పట్టిన శని చంద్రబాబే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా విమర్శించారు. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు...

Minister Roja: రాష్ట్రానికి, టీడీపీకి పట్టిన శని చంద్రబాబే

Roja

Minister Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా విమర్శించారు. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి శని చంద్రబాబు నాయుడేనని, ఇదే విషయాన్ని గతంలోనే ఎన్టీఆర్ కూడా చెప్పారని అన్నారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసి, నేడు వారి పోటో కి దండలు వేసి, దండం పెడుతూ చంద్రబాబు భలేగా నటిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు.

Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా

మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెడితే, కనీస కృతజ్ఞత కూడా చెప్పలేదని, అదీ ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఉన్న ప్రేమ అంటూ ఘాటుగా విమర్శించారు. ఇటీవల మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి అమానుషమని రోజా ఖండించారు. పోలీసులు అల్లర్లను అనిచివెయ్యడానికే ఎంతో సమ్యవనం పాటించారని అన్నారు. అల్లర్లకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేదేలేదని, విచారణ కొనసాగుతుందని రోజా తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, జగన్ లాంటి మంచి సీఎంను ఎన్నడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి టిడిపి నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.

Minister Roja: మంత్రి గారూ.. నాకు పెళ్లి కావాలంటూ రోజాకు మొరపెట్టుకున్న వృద్ధుడు

మహానాడులో టీడీపీ వికృత చేష్టలు చూస్తుంటే నవ్వొస్తుందని రోజా ఎద్దేవా చేశారు. జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, మ్యానిఫెస్టో ను వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. మహానాడుకు జనం లేరని, మంత్రుల యాత్రకు జనo ప్రవాహంలా తరలివస్తోందని అన్నారు. 30 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని లోకేష్ చెబుతున్నారని, చంద్రబాబు సిఎం అవుతారని చెప్పడం చిత్రంగా ఉందన్నారు. మాది సామాజిక న్యాయం చేసే బస్సు యాత్ర అయితే మీ మహానాడు సన్నాసుల కార్యక్రమం అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో రాజకీయం చేయాలని చూశారని, ప్రజల చేతుల్లో వీళ్ళు దెబ్బలు తినడం ఖాయమంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు చేశారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలా? వద్దా? అనేది టిడిపి, బిజెపిలు సూటిగా చెప్పాలంటూ రోజా డిమాండ్ చేశారు. ఇన్నేళ్లు బాలకృషకు తండ్రి ఎన్టీఆర్ గుర్తుకు రాలేదని, ఇప్పుడు సొంత గ్రామంలో ఆయన విగ్రహం పెడతానని చెబుతున్నాడని, ముందు.. చంద్రబాబు స్క్రిప్ట్ చదవడం మానేసి, బాలకృష్ణ సొంతంగా నాయకుడిగా ఎదిగితే మంచిదంటూ రోజా వ్యాఖ్యానించారు.