Minister Roja: ఎన్టీఆర్ పేరు కరివేపాకులా వాడుకున్నారు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు టచ్‌లో ఉన్నారో చెప్పాలి: రోజా

టీడీపీ నేతలు ఎన్టీఆర్ పేరును కరివేపాకులా వాడుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో ఆయన ఒక్క ఫొటో కూడా పెట్టలేదు. ఒక్క కాలేజీకి కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదో చెప్పాలి. అప్పుడు వెన్నుపోటు పొడిచి, ఇవాళ దివంగత ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నారు. ఎన్టీఆర్ కుర్చీ లాగి ఇవాళ ఆయన పేరు చెబుతున్నారు.

Minister Roja: ఎన్టీఆర్ పేరు కరివేపాకులా వాడుకున్నారు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు టచ్‌లో ఉన్నారో చెప్పాలి: రోజా

Minister Roja: చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎన్టీఆర్ పేరును కరివేపాకులా వాడుకున్నారని విమర్శించారు ఏపీ మంత్రి రోజా. టీడీపీ అధికారంలో ఉండగా పార్టీ ఆఫీసులో ఆయన ఫొటో కూడా పెట్టలేదన్నారు. మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పించారు.

Bhadradri: భద్రాద్రిలో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి.. సీఎం కేసీఆర్ హాజరుపై సందిగ్ధత

‘‘టీడీపీ నేతలు ఎన్టీఆర్ పేరును కరివేపాకులా వాడుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో ఆయన ఒక్క ఫొటో కూడా పెట్టలేదు. ఒక్క కాలేజీకి కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదో చెప్పాలి. అప్పుడు వెన్నుపోటు పొడిచి, ఇవాళ దివంగత ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నారు. ఎన్టీఆర్ కుర్చీ లాగి ఇవాళ ఆయన పేరు చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 40 మంది ఎందుకు టచ్‌లో ఉన్నారో అచ్చెన్నాయుడు చెప్పాలి. మీకు అభ్యర్థులు లేక మా వాళ్లు టచ్‌లో ఉన్నారా అన్నది చెప్పాలి. పార్టీ లేదు.. బొక్కా లేదు అన్న వ్యక్తి అచ్చెన్నాయుడు. పిల్లగాడు లోకేష్ చిన్నా.. పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నాడు.

10th Exams: ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

మా ఎమ్మెల్యేలను ఉరికించి కొడతా అన్న మాటల్ని లోకేష్ వాపసు తీసుకోవాలని హెచ్చరిస్తున్నా. అమ్ముడుపోయిన వ్యక్తులు చెప్పే మాటలకు ఎవరూ విలువ ఇవ్వరు. అమరావతి ప్రాంత ఓటర్లు సైతం టీడీపీని ఓడించారు. ఆ విషయం మరచిపోయి ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవి అమరావతికి మద్దతు తెలపడం విడ్డూరం. అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్ అని ఆమె అన్నది. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతోంది’’ అని రోజా విమర్శించారు.