Seediri Applaraju : 150మంది అనుచరులతో శ్రీవారి ప్రొటోకాల్ దర్శనం వివాదంపై మంత్రి క్లారిటీ

తిరుమల శ్రీవారి దర్శనంలో ప్రొటోకాల్ ఉల్లంఘించినట్లు వచ్చిన విమర్శలపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు వివరణ ఇచ్చారు. 150 మంది అనుచరులతో కలిసి ప్రొటోకాల్ దర్శనానికి వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. అంతమందిని అనుమతించడం కుదరదన్న అధికారులపై ఒత్తిడి తెచ్చి మంత్రి అప్పలరాజు దర్శనానికి వెళ్లినట్లుగా వచ్చిన విమర్శల్లో నిజం లేదన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.

Seediri Applaraju : 150మంది అనుచరులతో శ్రీవారి ప్రొటోకాల్ దర్శనం వివాదంపై మంత్రి క్లారిటీ

Seediri Appalaraju Tirumal

Seediri Appalaraju : తిరుమల శ్రీవారి దర్శనంలో ప్రొటోకాల్ ఉల్లంఘించినట్లు వచ్చిన విమర్శలపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు వివరణ ఇచ్చారు. 150 మంది అనుచరులతో కలిసి ప్రొటోకాల్ దర్శనానికి వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. అంతమందిని అనుమతించడం కుదరదన్న అధికారులపై ఒత్తిడి తెచ్చి మంత్రి అప్పలరాజు దర్శనానికి వెళ్లినట్లుగా వచ్చిన విమర్శల్లో నిజం లేదన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.

”150 మందితో వచ్చాము అంటూ 150 మంది మందీ మార్బలం అని ఉంటారు. సామాన్య భక్తుల మాదిరి క్యూలైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాం. ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులా క్యూలైన్ లో వెళ్లి దర్శనం చేసుకున్నాం. దేవుడిని తనివితీర చూడాలన్నదే మా ఉద్దేశ్యం తప్ప.. అధికార హోదా ప్రదర్శించాలనో, దర్పం ప్రదర్శించాలనో అనేది లేదు. ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వలేదు. చాలా సంతోషంగా, ఒక కుటుంబసభ్యుల్లా కలిసి మెలిసి దర్శనం చేసుకున్నాం” అని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు.

Tirumala : టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు-20 రోజుల్లో రూ.100 కోట్ల పైగా ఆదాయం

మంత్రి అప్పలరాజు తిరుమలలో హల్ చల్ చేశారు. భారీగా అనుచరులతో తిరుమల చేరుకున్నారు మంత్రి అప్పలరాజు. తన అనుచరులందరికి ప్రొటోకాల్ దర్శనం కల్పించాలటూ టీటీడీ అధికారులపై ఆయన ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. మంత్రి కావడంతో నిబంధనలు పక్కన పెట్టి మంత్రి చెప్పినట్లుగా 150 మంది అనుచర వర్గానికి టీటీడీ సిబ్బంది ప్రోటోకాల్ దర్శన కల్పించిందట.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మంత్రి సీదిరి అప్పలరాజు దాదాపు 150 మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకున్నారనే వార్త చర్చనీయాంశమైంది. గురువారం ఉదయం వారంతా వీఐపీ ప్రోటోకాల్‌తో శ్రీవారిని దర్శించుకున్నారని.. ఈ విషయంలో టీటీడీ తీరుపై స్థానికులు, సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. సామాన్యులు గంటల తరబడి క్యూలైన్ లో వేచి ఉంటే మంత్రి మాత్రం భారీ సంఖ్యలో అనుచరులతో వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఏంటని భక్తులు ప్రశ్నించారు. దీంతో దర్శనం అనంతరం దీనిపై మంత్రి అప్పలరాజు స్పందించారు. తనతో పాటు వచ్చిన 150 మంది అనుచరులు సామాన్య భక్తుల మాదిరిగానే క్యూలైన్ లో వెళ్లి దర్శనం చేసుకున్నామని.. తమ వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని వివరణ ఇచ్చారు.

Seediri Appalaraju : వచ్చే ఎన్నికల్లో 175 స్ధానాలు వైసీపీవే- మంత్రి సీదిరి అప్పలరాజు

మంత్రి వివరణ ఎలా ఉన్నా.. అంతమంది అనుచరులతో తిరుమలకు రావడం, వారికి ప్రోటోకాల్ దర్శనం కోసం పట్టుబట్టి టీటీడీపై మంత్రి ఒత్తిడి తెచ్చారనే వార్తలు.. భక్తుల ఆగ్రహానికి కారణమయ్యాయి.