Shankar Narayana : సినిమాలేవీ లేవు, అందుకే దీక్ష – బాలకృష్ణపై మంత్రి సెటైర్లు

సినిమా షూటింగ్ లు అయిపోయాయి, అందుకే బాలకృష్ణ హిందూపురానికి వచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు ఖాళీ సమయం దొరికినప్పుడు మాత్రమే హిందూపురం గుర్తుకు వస్తుందని,

Shankar Narayana : సినిమాలేవీ లేవు, అందుకే దీక్ష – బాలకృష్ణపై మంత్రి సెటైర్లు

Shankar Narayana

Shankar Narayana : హిందూపురం జిల్లా కేంద్రం కోసం సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్యమించనున్నారు. ఇందులో భాగంగా తన అసెంబ్లీ నియోజకవర్గం హిందూపురం చేరుకున్న బాలయ్య.. శుక్రవారం భారీ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం మౌన దీక్షకు కూర్చుంటారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చేపట్టనున్న మౌన దీక్షపై మంత్రి శంకర్ నారాయణ స్పందించారు.

సినిమా షూటింగ్ లు అయిపోయాయి, అందుకే బాలకృష్ణ హిందూపురానికి వచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. అఖండ సినిమా షూటింగ్ పూరై విడుదల కూడా అయిపోయింది, బాలకృష్ణకు ఇప్పుడు తీరిక సమయం దొరికిందని మంత్రి అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే హిందూపురం అభివృద్ది చెందిందన్న మంత్రి.. మళ్లీ ఇప్పుడు సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

Maharashtra : కరోనా టీకాతో కూతురు చనిపోయింది.. రూ. 1000 కోట్లు ఇవ్వాలన్న తండ్రి

సత్యసాయి బాబా లక్షల కోట్లు ఖర్చు చేసి అనంతపురము జిల్లాకు తాగునీటి సమస్యను తీర్చారు. అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ఎంతోమందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అనంతపురము జిల్లాకు సత్యసాయి బాబా చేసిన సేవలు దృష్టిలో ఉంచుకునే పుట్టపర్తిని సత్యసాయి జిల్లాగా సీఎం జగన్ ప్రకటించారని మంత్రి అన్నారు.

పెనుకొండను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని మా నియోజకవర్గ ప్రజల తరుఫున నేను కూడా సీఎంని కోరానని మంత్రి చెప్పారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలన్నది ఆ ప్రాంత వాసుల అభిప్రాయం అన్నారు. బాలకృష్ణకు ఖాళీ సమయం దొరికినప్పుడు మాత్రమే హిందూపురం గుర్తుకు వస్తుందని, అప్పుడు మాత్రమే హిందూపురానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుంటారని మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు.

ఏపీలో కొత్త జిల్లాల జగడం ముదురుతోంది. 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జిల్లాల పునర్ విభజనను కొందరూ స్వాగ‌తిస్తుంటే.. మ‌రికొంద‌రు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Stomach Problem : పొట్ట సమస్య బాధిస్తుందా!…పరిష్కారం మీ చేతుల్లో?…

హిందూపురం జిల్లా కేంద్రం కోసం స్థానికులు ఆందోళన బాటపట్టారు. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూరం జిల్లా కేంద్రం కోసం స్థానికులు ఆందోళనలు చేస్తుండగా, ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం బాలయ్య దీక్ష చేపట్టనున్నారు.