AP PRC 2022 : పీఆర్సీ సాధన సమితిపై మంత్రుల కమిటీ ఫైర్

రాజకీయ ఆలోచనతో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయా ? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. తాము అవసరమైతే నాలుగు మెట్లు దిగుతామని సజ్జల చెప్పడాన్ని అలసత్వంగా...

AP PRC 2022 : పీఆర్సీ సాధన సమితిపై మంత్రుల కమిటీ ఫైర్

Ap Prc 2022

Ministers Committee Comments On PRC : పీఆర్సీ వివాదం మరింత ముదురుతోంది. చర్చలకు రావాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. తాము వినిపిస్తున్న డిమాండ్లను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగుల సంఘాలు తేల్చిచెబుతుండడంతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. 2022, జనవరి 28వ తేదీ శుక్రవారం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీ ఎదురు చూసింది. వారు రాకపోవడంపై మంత్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక స్టీరింగ్ కమిటీ పిలుస్తేనే వస్తామని, వారితో చర్చలకు ప్రభుత్వం తలుపులు తెరిచే ఉందని..అయితే..ఇలాగే వ్యవహరిస్తే.. చట్టం ప్రకారం జరుగుతోందని మంత్రి బోత్స వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More : Goa Elections : పోటీ నుంచి తప్పుకున్న ప్రతాప్ సిన్హ్‌‌రాణె.. కోడలి కోసమేనా ?

ఉద్యోగులు చర్చలకు వస్తామని రాకపోవడంతో.. మంత్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్‌గా ఫోన్ చేసినా.. రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. తాజాగా.. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బోత్స సత్యనారాయణలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల కమిటీగా తాము ప్రతిరోజు వస్తున్నా..ఉద్యోగ సంఘాల నేతలు రావడం లేదన్నారు. అయితే.. కొన్ని ఉద్యోగ సంఘాలు రావడంతో.. వారితో చర్చించడం జరిగిందన్నారు. ఇదొక మంచి పరిణామమని, ఉద్యోగ సంఘాలు నేరుగా తనను ఏమన్నా పట్టించుకోనని సజ్జల తెలిపారు.

Read More : Green India Challenge : ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో రవితేజ హీరోయిన్.. ఎవరెవర్ని నామినేట్ చేసిందంటే..

తాము రోజూ వస్తున్నా ఉద్యోగ సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, రాజకీయ ఆలోచనతో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయా ? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. తాము అవసరమైతే నాలుగు మెట్లు దిగుతామని సజ్జల చెప్పడాన్ని అలసత్వంగా తీసుకుంటున్నారా అని నిలదీశారు. మంచి వాతావరణంలో ఉన్నామని, పాజిటివ్ మైండ్ తో ఉన్న సమయంలో చర్చలు జరిగితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబసభ్యులు ఆలోచించాలని సూచించారు. ఇక స్టీరింగ్ కమిటీ పిలిస్తేనే వస్తామని, వారితో చర్చలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. వాళ్లు చర్చలకు రాకుండా ఇలాగే వ్యవహరిస్తే… చట్టం ప్రకారం జరుగుతోందని హెచ్చరించారు.