Anil Slams Chandrababu Pawan : చంద్రబాబు, పవన్ ఎవరిని పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం-అనిల్ కుమార్ యాదవ్ | MLA Anil Kumar Yadav Slams Chandrababu Pawan Kalyan Over Alliances Issue

Anil Slams Chandrababu Pawan : చంద్రబాబు, పవన్ ఎవరిని పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం-అనిల్ కుమార్ యాదవ్

చంద్రబాబు, పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎవరితో కలిసుంటారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం అన్నారు. (Anil Slams Chandrababu Pawan)

Anil Slams Chandrababu Pawan : చంద్రబాబు, పవన్ ఎవరిని పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం-అనిల్ కుమార్ యాదవ్

Anil Slams Chandrababu Pawan : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎవరితో కలిసుంటారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం అన్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్. వాళ్ల మీద వాళ్లకి వ్యక్తిగతంగా నమ్మకం లేకనే అందరూ ఒక్కటవ్వాలని కోరుకుంటున్నారని అనిల్ కుమార్ యాద్ అన్నారు. బీజేపీకి తొత్తు జనసేన అన్న అనిల్ కుమార్ యాదవ్.. జనసేనతో టీడీపీ కలవాలని అనుకుంటోందన్నారు. ఈ మూడు పార్టీలు ఒక కూటమి అని విమర్శించారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం జగన్ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు. ఇది ప్రతిపక్ష నేతల్లో భయం ఏర్పరచింది. జగన్ ను ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలి అంటే మనం అందరం ఒక్కటవ్వాలి అనే ఆలోచనకు వచ్చారు. అంటే, వారి మీద వారికి నమ్మకం లేదనేగా. వ్యక్తిగతంగా వారి మీద వారికి నమ్మకాలు లేదు. ఒక వ్యక్తిని కొట్టాలి అంటే అందరూ కట్టగట్టుకుని అతడిని ఓడగొట్టాలి, లేకపోతే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడని అంటున్నారు. దీని బట్టి జగన్ రాష్ట్ర ప్రజల్లో ఎంత బలంగా ఉన్నారో, సంక్షేమం ఏ విధంగా నేరుగా అందిస్తున్నాడో తేలతెల్లం అవుతుంది” అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

”చంద్రబాబు, పవన్ పొత్తులు పెట్టుకుంటారో.. లేక వేరే వాళ్లతో కలిసి ఉంటారో..? కుదిరితే పెళ్లి చేసుకుంటారో వాళ్ల ఇష్టం. అది వైసీపీకి అనవసరం. ఎవరు.. ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు ఇక ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు. అయినా 75 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఏం ఉద్దరిస్తాడు? ముస్లింలను జగన్ కు దూరం చేసే కుట్ర జరుగుతోంది. కేవలం కలలు కనడం.. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్ప.. ఆయన చేసేదేమీ లేదు” అని అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.(Anil Slams Chandrababu Pawan)

Chandrababu : కుప్పం..చంద్రబాబుకు టెన్షన్ పుట్టిస్తోందా?అందుకే అక్కడే ఇల్లు కట్టుకుని మరీ పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటున్నారా?

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ, అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే ఎన్నికలు వస్తాయా? అనే అనుమానం కలగక మానదు. అధికారం, విపక్షం అన్న తేడా లేదు.. అన్ని పార్టీలు ఇప్పటికే జనం బాట పట్టాయి. అధికార వైసీపీ గడప గడపకు ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల్లోకి వెళ్తోంది. అంతేకాదు మంత్రులంతా రెండు రోజులు సచివాలయాల్లో ఉండి.. మిగిలిన ఐదు రోజులు ప్రజల్లోనే ఉండాలని కేబినెట్ భేటీ తర్వాత ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. దీంతో ముందస్తు ఎన్నికలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రజల్లోకి వెళ్లారు. బాదుడే బాదుడు పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇక నేను సైతం అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు పవన్.

ఇదే సమయంలో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. మరి పొత్తుల విషయంలో చంద్రబాబు వ్యూహం ఏంటి? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ సింగిల్ గా పోటీ చేయడం ఫిక్స్ అయ్యింది. మరి ప్రతిపక్షాల కూటమి ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.(Anil Slams Chandrababu Pawan)

Kodali Nani Comments: టీడీపీ, జనసేన, బీజేపీని మూటగట్టి బంగాళాఖాతంలో కలిపేస్తారు: కొడాలి నాని

ఎందుకంటే జనసేన, బీజేపీ ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి. కానీ 2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన వెళ్తుందనే ప్రచారం ఉంది. కానీ బీజేపీ దానికి నో అంటోంది. ముఖ్యంగా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే..? పొత్తు అవసరం అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైసీపీ మంత్రులు, నేతలు మాత్రం దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయాలని సవాల్ విసురతున్నారు. ఇలా పొత్తుల అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పొత్తుల రాజకీయం వేడెక్కిపోయింది.

×