Kodali Nani : చంద్రబాబు, లోకేశ్, ఎన్నారై.. ఎవరైనా సరే.. గుడివాడలో పోటీపై కొడాలి నాని హాట్ కామెంట్స్

వందల కోట్లు డబ్బు తెచ్చినా గుడివాడ ప్రజలు అమ్ముడుపోరని కొడాలి నాని అన్నారు. ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించరని చెప్పారు. కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ గెలుపు కోసం పోరాడతానని వ్యాఖ్యానించారు.

Kodali Nani : చంద్రబాబు, లోకేశ్, ఎన్నారై.. ఎవరైనా సరే.. గుడివాడలో పోటీపై కొడాలి నాని హాట్ కామెంట్స్

Kodali Nani : గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంపై టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొడాలి నాని దూకుడు చెక్ పెట్టేందుకు టీడీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. కొడాలిని ఢీకొట్టేందుకు వ్యూహాలు రచించిన టీడీపీ.. కొడాలిపై పోటీకి ఎన్నారైను రంగంలోకి దించే ప్లాన్ చేస్తోంది. ఈసారే ఎన్నారై వెనిగళ్ల రామును బరిలోకి దింపేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది. రాము అభ్యర్థిగా చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో కొన్నాళ్లుగా నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు రాము కుటుంబసభ్యులు. వచ్చే నెల నుంచే గుడివాడలోనే వెనిగళ్ల రాము ఉంటాడని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అయితే, టీడీపీ యాక్షన్ పై రియాక్షన్ ఇచ్చారు మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడలో గెలుపోటములను నిర్ణయించేది ఇక్కడి ప్రజలే అని కొడాలి నాని తేల్చి చెప్పారు. గుడివాడలో చంద్రబాబు, లోకేశ్, ఎన్నారై.. ఎవరు పోటీ చేసినా.. బరిలోకి దిగేది నేనే అని అన్నారు. ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించరని కొడాలి నాని చెప్పారు. వందల కోట్లు డబ్బు తెస్తే గుడివాడ ప్రజలు అమ్ముడుపోరని కొడాలి నాని అన్నారు. కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ గెలుపు కోసం పోరాడతానని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”గుడివాడలో 2లక్షల 10వేల మంది ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలి, ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి అనేది ఓటర్లు డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్, రాబిన్ శర్మ, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఎవరో నలుగురు పనికిమాలిన వ్యక్తులో గుడివాడలో ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలో నిర్ణయించే శక్తిగాని, సామర్థ్యం గాని ఉండవు. తెలుగుదేశం పార్టీ చందాలు వేసుకుని వందో రెండు వందల కోట్లో ఇచ్చి ఇక్కడికి పంపిస్తే, ఆ డబ్బులు ఇక్కడ రూ.5వేలు, రూ.10వేలు మనిషికి ఇస్తే తీసుకుని ఆ పార్టీకి ఓటు వేస్తారనే ఏదైనా పిచ్చి భ్రమల్లో ఉంటే పరాభవం తప్పదు. గతంలో ఏం జరిగిందో 2024లో కూడా అదే జరుగుతుంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినా, ఎన్ని కుల సంఘాలు చందాలు వేసుకుని పంపించినా.. వ్యక్తులు గుడివాడలో గెలుపోటములను ప్రభావితం చేయలేరు.