AP MLC Elections : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. బరిలో 8 మంది అభ్యర్థులు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

AP MLC Elections : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. బరిలో 8 మంది అభ్యర్థులు

AP MLC Elections (1)

AP MLC Elections : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ధికార పార్టీ నుంచి ఏడుగురు సభ్యులు, ప్రతిపక్ష టీడీపీ నుంచి ఒకరు బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు కావాల్సివుండటంతో విప్ లేకుండా జరిగే రహస్య బ్యాలెట్ లో ఏ ఓటు ఎటు పడుతుందనే ఉత్కంఠ నెలకొంది.

మొత్తం ఏడు స్థానాలకు జరుగున్నఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సాంకేతికంగా ఆరు స్థానాలు మాత్రమే గెలుచుకునే బలం ఉన్నా ఏడు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసంతృప్త ఎమ్మెల్యేలపై ప్రత్యేక నిఘా పెట్టి క్రాస్ ఓటింగ్ చేస్తారనే అనుమానం ఉన్నవారి లిస్టును తయారు చేసుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది.

AP MLA Quota MLC elections : ఏపీలో ఆసక్తికరంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

ప్రతిపక్ష టీడీపీకి సాంకేతికంగా ఒకటి గెలుచుకునే అవకాశం ఉన్నా నైతిక మద్దతు లేని కారణంతో తటపటాయిస్తూనే తమ అభ్యర్థిగా బీసీ మహిళ పంచుమర్తి అనురాధను ఎన్నికల బరిలో నిలబెట్టింది. తెలుగుదేశం అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు పడే అవకాశం లేకపోవడం అధికారి పార్టీకి కలిసొచ్చే అంశం. కానీ అధికార పార్టీ నుంచి ఒక్కటైనా క్రాస్ ఓటింగ్ జరిగే మాత్రం టీడీపీ అభ్యర్థి గెలుపు లాంఛనమే.అయితే అధికార వైసీపీని అసంతృప్త ఎమ్మెల్యేల ముసలం వేధిస్తోంది.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రభోదానుసారం తమ ఓటు వేస్తామని ఇద్దరు బహిరంగంగానే స్పష్టం చేశారు. దీంతో వైసీపీలో అలజడి మొదలైంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటు వేయకుంటే ఆ పార్టీకి మిగిలే బలం 154.

AP MLC Election Results 2023 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌స్వీప్.. పశ్చిమ రాయలసీమలోనూ విజయం

ఆ మొత్తం సభ్యులు కచ్చితంగా అధికార పార్టీ నిలబెట్టిన ఏడుగురు సభ్యులకు ఒక్కొక్కరు 22 ఓట్లు వేసేందుకు సరిపోతుంది. ఇక్కడే అధికార పార్టీని క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే రెండు సార్లు మాక్ పోలింగ్ నిర్వహించింది. హాజరైన వారిలోనూ ఆరుగురు ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేయడంపై అధికార పార్టీ అప్రమత్తమైంది.