బయటపడిన రోజా ఆడియో : ఆ కార్యక్రమాలకు వెళ్లను..పార్టీకి దూరం పెడుతా

  • Published By: madhu ,Published On : February 1, 2020 / 02:57 AM IST
బయటపడిన రోజా ఆడియో : ఆ కార్యక్రమాలకు వెళ్లను..పార్టీకి దూరం పెడుతా

వైసీపీ ఎమ్మెల్యే, APIIC ఛైర్మన్ రోజా ఆడియో కలకలం రేపుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. కొంత సీరియస్‌గా..కొంత ఆగ్రహంగా..కొంత ఆవేదనగా ఆమె వ్యాఖ్యలున్నాయి. ప్రధానంగా సొంత నియోజకవర్గమైన నగరి నియోజకవర్గంలోని ముఖ్యమైన వైసీపీ నేతలను ఈ సందర్భంగా ఆడియో టేపుల్లో హెచ్చరించారు. జిల్లాకు చెందిన ముఖ్యమైన వైసీపీ నేతతో ఆమెకు చాలా కాలంగా విబేధాలున్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 

ఆ ముఖ్య నేత..కొంతమందిని అనుచరులను పోగేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ ప్రోగ్రామ్స్‌కు నగరి నుంచి పార్టీ కార్యకర్తలు వెళుతున్నారని రోజాకు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. చాలాకాలం పాటు స్తబ్దుగా ఉన్న రోజా..ఇటీవలే నగరి నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో పర్యటించారు. కానీ అక్కడి ప్రజలు తిరుగుబాటు చేశారు. వాహనాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనను రోజా సీరియస్‌గా తీసుకున్నారు. ఒక రకంగా తీరని అవమానం భావించారు. చిత్తూరు జిల్లాలో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించడానికి వచ్చిన సీఎం జగన్ వద్ద ఈ ఘటనను ప్రస్తావంచినట్లు సమాచారం.

ఏదో ఒకటి తేల్చుకోవాలని రోజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ ముఖ్యనేత కార్యక్రమాలకు నగరి నుంచి వైసీపీ లీడర్స్ వెళుతుండడంతో రోజా ఆడియో ద్వారా హెచ్చరించారు. ‘నన్ను వెన్నుపోటు పొడిచారు..పార్టీకి ద్రోహం చేశారు..తనను అందరిలో అవమాన పరిచారు..అట్లాంటి వ్యక్తులు నిర్వహించే కార్యక్రమాలకు ఏ కార్యకర్త కూడా వెళ్లకూడదు’.. అని చె ప్పడం ద్వారా స్థానిక నేతలకు అల్టిమేటం జారీ చేశారు. మరి ఈ ఆడియో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి మరి.

Read More :  రెస్క్యూ మిషన్ : చైనా నుంచి వచ్చిన భారతీయులు..ఎంతమంది వచ్చారంటే