ఎమ్మెల్యే రోజాపై దాడి ఘటన : కేసు నమోదు చేసిన పోలీసులు

చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్ లో నగరి ఎమ్మెల్యే రోజా సొంత పార్టీకి చెందిన కార్యకర్తలపైనే ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పురంలో తన కారుపై దాడి చేశారని రోజా పోలీసులకు

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 03:48 AM IST
ఎమ్మెల్యే రోజాపై దాడి ఘటన : కేసు నమోదు చేసిన పోలీసులు

చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్ లో నగరి ఎమ్మెల్యే రోజా సొంత పార్టీకి చెందిన కార్యకర్తలపైనే ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పురంలో తన కారుపై దాడి చేశారని రోజా పోలీసులకు

చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న ఘటనలో పుత్తూరు పోలీసుల కేసు నమోదు చేశారు. వైసీపీ నేత లక్ష్మణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 37మందిపై కేసు నమోదు చేశారు. నిన్న(జనవరి 5,2020) పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో గ్రామస్తులు రోజాను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రోజా తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ భవనం శిలాఫలకం ఆవిష్కరణకు రోజా వెళ్లారు. ఆ సమయంలో గ్రామస్తులు ఆమెను అడ్డగించారు. హరీష్, సంపత్, సురేష్, రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తితో పాటు పలువురిపై 143, 341, 427, 506, 509, 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు బుక్ చేశారు. ఎమ్మెల్యే రోజా కారుపై దాడికి యత్నించారని వైసీపీ నేత లక్ష్మణ మూర్తి పోలీసులకు కంప్లయింట్ చేశారు.

ఆదివారం(జనవరి 05,2020) ఎమ్మెల్యే రోజా తన నియోజవర్గంలోని పుత్తూరు మండలం కేబీఆర్ పురానికి వెళ్లారు. అయితే ఆమెను గ్రామంలోకి రానీయకుండా మాజీ ఎంపీటీసీ కుమారుడు, అమ్ములు వర్గీయులు, గ్రామస్తులు కారును అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రోజా కారుపై అమ్ములు వర్గం దాడికి ప్రయత్నించింది. సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును ముందుకు కదలనివ్వలేదు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గ్రామ సచివాలయ కార్యక్రమానికి తమను పిలవకపోవడాన్ని తప్పుపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజా కారు అద్దం దించి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వారు ఆమె మాట వినలేదు. మరింత పెద్దగా ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో రోజా కారు అద్దం ఎత్తారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్ధుమణిగింది.
 
తాను కారులో ఉండగా.. అమ్ములు వర్గీయులు కారుపై దాడికి ప్రయత్నించారని రోజా ఆరోపించారు. గత ఎన్నికల్లో అమ్ములు వర్గం తనకు వ్యతిరేకంగా పని చేసిందని రోజా చెబుతున్నారు. తనపై అమ్ములు వర్గం దాడికి ప్రయత్నించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. అమ్ములు వర్గం వెర్షన్ మరోలా ఉంది. ఎమ్మెల్యే రోజా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు కాకుండా.. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటివరకు కనీసం తమను పట్టించుకోలేదని వాపోయారు. మొత్తంగా రోజాని అడ్డుకోవడం, నిరసన తెలపడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : హైదరాబాద్ లో మరో మిస్సింగ్ మిస్టరీ : డిసెంబర్ 26 నుంచి కనిపించని ఐటీ ఉద్యోగిని