మాస్క్ లేకుండానే ఎమ్మెల్యే రోజా నగరి పర్యటన..పార్టీ కేడర్ లో తీవ్ర చర్చ

  • Published By: bheemraj ,Published On : July 8, 2020 / 07:44 PM IST
మాస్క్ లేకుండానే ఎమ్మెల్యే రోజా నగరి పర్యటన..పార్టీ కేడర్ లో తీవ్ర చర్చ

కరోనా కంగారెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా లెక్కచేయడం లేదు. మాస్క్ ధరించకుండానే సొంత నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో పర్యటించారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ కూడా చేశారు. అయితే ఎక్కడా కూడా మాస్క్ ధరించలేదు. ఇక రోజా మాస్క్ వేసుకోకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆమె సందడి చేశారు. నియోజవర్గంలోని నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో ఆమె అనేక కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ చిత్రపటానికి నివాళి అర్పించి, పూజుల, హారతి పట్టారు. ఆమె కార్యకర్తలతో మాట్లాడారు. అయితే ఎక్కడా కూడా మాస్క్ ధరించకపోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆమెతో పాటు పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు 90 శాతం మాస్క్ ధరించే ఉన్నారు.

మొత్తం కార్యక్రమాల్లో ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగితా అందరూ మాస్క్ ధరించే ఉన్నారు. నిన్న కూడా ఆమె మాస్క్ ధరించలేదు. స్వయంగా ప్రజాప్రతినిధి ఇట్లా చేయడం ఏంటని ప్రజా కేటగిరిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందువల్ల రోజా కనీసం మాస్క్ ధరించడం లేదనే చర్చ పార్టీ కేటగిరిలో నడుస్తోంది.

కరోనా మహమ్మారి చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టింస్తోంది. ఇవాళ ఆల్ టైమ్ రికార్డు రాష్ట్రంలో మరే జిల్లాలో ఒక్కరోజులో నమోదు కానన్ని 260 కేసులు నమోదు అయ్యాయి. ప్రమాదకర మండలాల్లో నగరి నియోజకవర్గంలోని పుత్తూరు కూడా ఉంది. పుత్తూరు మూడో స్థానంలో ఉంది. పుత్తూరులో ఇప్పటికే 150 కేసులు నమోదయ్యాయి. అలాంటి చోట కూడా పాల్గొన్న రోజా కనీసం మాస్క్ ధరించాల్సివుండాల్సింది. ఎందుకంటే ఆమె ఒక ప్రజాప్రతినిధి. ఆమె మాస్క్ ధరించలేదంటే మిగతా వారంతా ఆమె ధరించలేదు కదా అన్న చర్చను మొదలు పెడతారు.

ఈ నేపథ్యంలో రోజా ఏ మాత్రం మాస్క్ ధరించకుండా అనేక కార్యక్రమాల్లో విస్తృతంగా సుడిగాలి పర్యటన చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ కేడర్ లో ఈ అంశం చర్చనీయాంశం అయింది. నిన్న కూడా 108, 104 వాహనాల ప్రారంభంలో ఆమె పాల్గొన్నారు. స్వయంగా ఆమె వాహనాన్ని నడిపి సంచలనం సృష్టించారు. ఆ కార్యక్రమంలో కూడా ఆసాంతం ఎక్కడ కూడా మాస్క్ ధరించలేదు.

చివరకు పార్టీ కేడర్ అంతా కూడా నో మాస్క్ రోజా అంటూ మాట్లాడుకోవడం కనిపించింది. ఆమె ఎందుకు మాస్క్ ధరించలేదనేది ఆశ్చర్యం కల్గిస్తోంది. ఎవరితో కూడా కరచాలనం చేయనప్పటికీ కూడా ఆమె ఎందుకు మాస్క్ ధరించలేదనేది కొంత చర్చనీయాంశమైంది. పార్టీ నేతలు కూడా రోజమ్మ మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ఒకరినొకరు మాట్లాడుకోవడం కూడా కనిపించింది.