నన్ను వెన్నుపోటు పొడిచారు : ఎమ్మెల్యే రోజా

సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా కారుపై దాడి ఘటన కలకలం రేపింది. రోజాను అడ్డుకున్న గ్రామస్తులు, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక రోజా

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 05:17 AM IST
నన్ను వెన్నుపోటు పొడిచారు : ఎమ్మెల్యే రోజా

సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా కారుపై దాడి ఘటన కలకలం రేపింది. రోజాను అడ్డుకున్న గ్రామస్తులు, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక రోజా

సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా కారుపై దాడి ఘటన కలకలం రేపింది. రోజాను అడ్డుకున్న గ్రామస్తులు, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక రోజా అందుబాటులో లేరని ఆరోపించారు. ఈ గొడవకు సంబంధించి వైసీపీ నేత ఫిర్యాదుతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచి.. జిల్లా పెద్ద నాయకుల సహకారంతో తనకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేశారని రోజా ఆరోపించారు. వైసీపీ ముసుగులో.. సచివాలయం అనే కుంటి సాకుతో దాడి చేయాలనుకుంటే అధినేత జగన్ సహా ఎవరూ ఒప్పుకోరని అన్నారు.

ఎన్నికల్లో తనను ఓడించాలనే ప్రయత్నం జరిగిందని.. ఇప్పుడు విజయాన్ని జీర్ణించుకోలేక 4 నెలలుగా కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తప్పుచేసిన వారిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను అన్నారు. కార్యకర్తలు ఎవరైనా నేరుగా తన ఇంటికి వచ్చి పనులు చేయించుకునే స్వతంత్రం ఉందని రోజా స్పష్టం చేశారు. ఇలా కుట్రలు కుతంత్రాలు చేయడం సరికాదన్నారు.

సచివాలయ భవనం శిలాఫలకం శంకుస్థాపన కోసం ఎమ్మెల్యే రోజా.. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం కేబీఆర్ పురానికి వెళ్లిన సమయంలో కారుపై దాడి జరిగింది. ఆమెను గ్రామంలోకి రానీయకుండా అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్ధుమణిగింది. కాగా, ఈ వ్యవహారం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఈ దాడిని రోజా సీరియస్ గా తీసుకున్నారు.

Also Read : 136మంది మగాళ్లను రేప్ చేశాడు : అమ్మాయిలే కాదు అబ్బాయిలూ జాగ్రత్త