టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై!

  • Published By: madhu ,Published On : September 19, 2020 / 07:51 AM IST
టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై!

Vishakapatnam South, Vishakapatnam, TDP : టీడీపీకి వరుసుగా షాక్ లు తగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చేజారిపోతున్నారు. కొంతమంది వైసీపీ గూటికి చేరుతున్నారు. ప్రధానంగా టీడీపీకి కంచుకోటగా విశాఖ ఉంది. ప్రస్తుతం దీనికి బీటలు పడుతున్నాయి.




విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి గణేష్ వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈయనతో పాటు మరో ఎమ్మెల్యే కూడా పార్టీకి దూరం కానున్నారని తెలుస్తోంది.
https://10tv.in/dalit-tonsuring-case-nutan-naidu-swindled-rs-12-crore-from-two-youths-to-get-jobs/
గత కొంతకాలంగా గణేష్ టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం సీఎం జగన్ ను కలువనున్నారని టాక్. టీడీపీ తరఫున శాసనసభకు పోటీ చేసి విజయం సాధించిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలు వైసీపీ పార్టీలో చేరని సంగతి తెలిసిందే. టెక్నికల్ గా పార్టీలో చేరకపోయినా..మద్దతు ఇస్తున్నారు. ఇదే బాటలో గణేష్ పయనిస్తారని తెలుస్తోంది.

2009 ఎన్నికల్లో విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున వాసుపల్లి గణేష్ పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014లో విజయం సాధించారు.. 2019లో మళ్లీ గెలిచారు.




2019లో సీనియర్లకు కాకుండా టీడీపీ అధిష్టానం కొత్త వారిని బరిలోకి దింపింది. 2019 విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్‌ను బరిలోకి దింపింది.

అనకాపల్లి నుంచి టికెట్‌ ఆశించిన సత్యవతికి కాకుండా విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీరాం కుమారుడు అడారి అనంద్‌కు టికెట్లు కేటాయిచింది. ఇక అరకు నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కు టికెట్‌ ఇచ్చింది. వీరిలో ఏ ఒక్కరూ విజయం సాధించలేదు.