MLAs Vaccinated : అధికార దుర్వినియోగం : సిబ్బందిని పిలిపించుకుని ఇంట్లోనే వ్యాక్సిన్ వేయించుకున్న ఎమ్మెల్యేలు

తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల వైఖరి విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆయా ఆసుపత్రులకు వెళ్లి వేయించుకోవాల్సి ఉండగా.. ఎమ్మెల్యేలు మాత్రం సిబ్బందిని ఇళ్లకు పిలిపించుకుని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.

MLAs Vaccinated : అధికార దుర్వినియోగం : సిబ్బందిని పిలిపించుకుని ఇంట్లోనే వ్యాక్సిన్ వేయించుకున్న ఎమ్మెల్యేలు

Mlas Vaccinated

MLAs vaccinated at home : తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల వైఖరి విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆయా ఆసుపత్రులకు వెళ్లి వేయించుకోవాల్సి ఉండగా.. ఎమ్మెల్యేలు మాత్రం సిబ్బందిని ఇళ్లకు పిలిపించుకుని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తమ ఇంట్లోనే వ్యాక్సిన్ వేయించుకున్నారు.

దేశ ముఖ్యనేతలు వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకా వేసుకుంటున్నారు. ప్రధానమంత్రి లాంటి వాళ్లే వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకుంటున్నారని.. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేలు అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతూ.. అధికార దర్పం ప్రదర్శిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.