Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం..
కృష్ణంరాజు మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.
Krishnam Raju: సినీ నటుడు కృష్ణంరాజు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. కృష్ణంరాజు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, సినీ రంగంలో ఆయన చేసిన సేవలు భావి తరాలు గుర్తుంచుకుంటాయని మోదీ పేర్కొన్నారు.
Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం
మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని.. తనకు ఎంతో ఆప్త మిత్రుడని కేసీఆర్ అన్నారు. ఆయన ఆదేశాలతో కృష్ణంరాజు అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపట్లో కృష్ణంరాజు పార్థివదేహం ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి చేరుకోనుంది. అక్కడ అభిమానులు, సన్నిహితుల సందర్శన కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Krishnam Raju: కృష్ణంరాజు మృతికి కారణాన్ని వెల్లడించిన ఆస్పత్రి వర్గాలు..
సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. కృష్ణంరాజు మృతిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీడీపీ నేత నారా లోకేష్, సీపీఐ నేత నారాయణ సహా ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Saddened by the passing away of Shri UV Krishnam Raju Garu. The coming generations will remember his cinematic brilliance and creativity. He was also at the forefront of community service and made a mark as a political leader. Condolences to his family and admirers. Om Shanti pic.twitter.com/hJyeGVpYA5
— Narendra Modi (@narendramodi) September 11, 2022
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు శ్రీ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి అకాల మరణం పార్టీకి, సమాజానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. https://t.co/bUDYSqi09R
— G Kishan Reddy (@kishanreddybjp) September 11, 2022
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2022
తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ యు కృష్ణంరాజు గారు మనల్ని విడిచిపెట్టారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అతను బహుముఖ నటనతో మరియు సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి.
— Amit Shah (@AmitShah) September 11, 2022