TTD College : టీటీడీ కళాశాలలో లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్, వార్డెన్ సస్పెండ్

టీటీడీ కళాశాలలో లైంగిక వేధింపుల పర్వం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాచ్య కళాశాలలో

TTD College : టీటీడీ కళాశాలలో లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్, వార్డెన్ సస్పెండ్

Ttd College

TTD College : టీటీడీ కళాశాలలో లైంగిక వేధింపుల పర్వం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాచ్య కళాశాలలో(శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ కాలేజ్) విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్, వార్డెన్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. దీనిపై అంతర్గతంగా విచారణ జరిపిన టీటీడీ ఉన్నతాధికారులు కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథంలను సస్పెండ్ చేశారు.

Tomatoes : టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా?

టీటీడీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలను ఎంతో పవిత్రంగా చూస్తారు. అటువంటి విద్యాసంస్థలో లైంగిక వేధింపుల పర్వం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఎస్వీ ప్రాచ్య కాలేజీలో ఎప్పటి నుంచో లైంగిక వేధింపులు జరుగుతున్నట్లుగా సమాచారం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్, వార్డెన్ లను అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది.

Jio Users : జియో యూజర్లు రీచార్జీ తేదీ మరిచిపోయారా? నో ప్రాబ్లమ్

తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాసంస్థల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు? అదే విధంగా విద్యార్థుల వాంగూల్మాలు తీసుకునే పనిలో విజిలెన్స్ విభాగం ఉంది. ఇప్పటికైతే ప్రాథమికంగా ఇద్దరిని సస్పెండ్ చేశారు.