Molestation : దారుణం.. కూతురిపై 6 నెలలుగా లైంగిక దాడి

ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ భద్రత లేదు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. వావి వరుసలు మరిచి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.

Molestation : దారుణం.. కూతురిపై 6 నెలలుగా లైంగిక దాడి

Molestation

Molestation Father Daughter nellore: ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ భద్రత లేదు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. వావి వరుసలు మరిచి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14ఏళ్ల కుమార్తెపై 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య అనే వ్యక్తి తన భార్యతో విడిపోయాడు. ఆ తర్వాత మరో వివాహితను పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళకు కొడుకు, కూతురు ఉన్నారు. ఆ మహిళ అంజయ్యతో కలిసి ఉంటోంది. కాగా, అంజయ్య ఆమె కూతురిపైనా కన్నేశాడు. గత 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. గత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను అత్యాచారం చేసేందుకు అంజయ్య యత్నించాడు.

ఇది గమనించిన పదేళ్ల కొడుకు కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. దీంతో అంజయ్య అక్కడి నుంచి పారిపోయాడు. స్థానిక మహిళా సంఘం నేతలు, అధికారులు, వలంటీర్ల సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అంజయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.