MLC Elections: పట్టభద్రుల ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే.. కౌంటింగ్ అక్రమాలపై కోర్టుకు వెళ్తాం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రవీంద్రా రెడ్డి

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే. కౌంటింగ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తాం. ఓట్ల తారుమారుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మొదటి రెండు రౌండ్లు నాకు మెజారిటీ వచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున టీడీపీ సీనియర్ నేతలు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండటం అనైతికం.

MLC Elections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే అని వ్యాఖ్యానించారు ఆ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డి. కౌంటింగ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. తాజా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై రవీంద్రా రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు.

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు… పలు చోట్ల వడగళ్ల వర్షం.. మరో రెండు రోజులు వానలే!

‘‘పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే. కౌంటింగ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తాం. ఓట్ల తారుమారుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మొదటి రెండు రౌండ్లు నాకు మెజారిటీ వచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున టీడీపీ సీనియర్ నేతలు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండటం అనైతికం. వైఎస్సార్‌సీపీ, ఇండిపెండెంట్ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి దాకా స్పందన లేదు. 8వ రౌండ్‌లో 19వ టేబుల్‌లో నాకు వచ్చిన 6 ఓట్లు టీడీపీ అభ్యర్థికి కలిపారు. ఆ విషయాన్ని నేను వెంటనే గుర్తించి, పట్టుకుని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశా. ఎన్నికల అధికారి వచ్చి పొరపాటు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించారు.

Zimbabwe: భూమిలోకి కుంగిపోయిన క్లాస్ రూమ్.. 17 మందికి విద్యార్థులకు గాయాలు

ఆ తప్పు సరి చేశారు. అన్ని రౌండ్లలో కూడా ఇలానే చేశారు. 10 రౌండ్లలో నాకే మెజారిటీ వచ్చింది. రెండవ ప్రాదాన్యత ఓట్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది’’ అని రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి మాట్లాడారు. ‘‘ఓట్ల తారుమారును ఎన్నికల అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రీ కౌంటింగ్ చేయాలి. వైఎస్సార్‌సీపీకి చెందిన ఓట్లను టీడీపీ ఖాతాలో ఎలా వేస్తారు? ఈ విషయంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు.

 

ట్రెండింగ్ వార్తలు