కేసీఆర్ వ్యాఖ్యాలకు సమాధానం చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ

  • Published By: bheemraj ,Published On : August 11, 2020 / 05:08 PM IST
కేసీఆర్ వ్యాఖ్యాలకు సమాధానం చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదిరింది. కేసీఆర్ వ్యాఖ్యాలకు సమాధానం చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ కోసం నిర్మించారన్న కేసీఆర్ వ్యాఖ్యాలపై ఏపీ సర్కార్ విస్మయం వ్యక్తం చేసింది. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించింది. ఎలాంటి గొడవలు లేకుండానే రికార్డు రూపంలో సమాధానం ఇస్తామని ఏపీ ప్రభుత్వం అంటోంది.

ఏపీ ప్రభుత్వం మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని, ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లోనే తేల్చుకోవాలని నిర్ణయించింది. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేయాలి, కేసీఆర్ వ్యాఖ్యలను ఎపెక్స్ మీటింగ్ లో తిప్పికొట్టాలని ఏపీ ప్రభుత్వం అధికార యంత్రంగానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి అన్ని లెక్కలను జల వనరుల శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

అయితే శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ ఉత్పత్తికి నిర్మించారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేస్తోంది. అటువంటి దానికి ఇంత ఆయకట్టు ఎందుకుందని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించే అవకాశం ఉంది. కేసీఆర్ తో సఖ్యతతో ఉండాలి..ఉన్నటువంటి సమస్యలు ఆస్తుల పంపకం, జల వివాదాలు, ఇరు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే విషయంలో గావొచ్చు సఖ్యతగా ఉండాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

వైసీపీ పార్టీ కూడా అదే ధోరణితో ఉంది. కానీ కేసీఆర్ మాత్రం శృతి మించి మాట్లాడుతున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ లాగా బయటికొచ్చి మాట్లాడొద్దని వైసీపీ పెద్దలు సూచనలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.
అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులను సమావేశంలో లేవనెత్తాలని, మిగులు జలాలకు సంబంధించి వరదనీరు సముద్రంలో వృధాగా పోతున్న వరద నీటికి సంబంధించి రైతులు వాడుకునే అంశంపై కూడా కేసీఆర్ మొదటి నుంచి చేస్తున్న అభ్యంతరాలపై ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడాలని నిర్ణయించారు.