Movie Tickets Online : ఏపీలో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు.. ఎల్లుండి నుంచి అందుబాటులోకి

ఈ నిర్ణయంతో టికెట్‌ రేట్ల నియంత్రణతో పాటు, బ్లాక్‌ టికెట్ల విక్రయ దందాకు చెక్‌ పడనుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక పూర్తిగా టికెట్లన్నీ ఆన్‌లైన్‌లో అమ్మనున్నారు.

Movie Tickets Online : ఏపీలో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు.. ఎల్లుండి నుంచి అందుబాటులోకి

Movie Ticket Online

Movie tickets online : ఏపీలో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకానికి లైన్‌ క్లియరైంది. ఎల్లుండి నుంచి ఏపీలో ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. టికెట్ల అమ్మకాల కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టెండర్లు పూర్తి చేసింది. ప్రైవేట్‌ సంస్థల కంటే తక్కువ ధరకే నిర్వహించి ప్రేక్షకులకు టికెట్లు అందించేందుకు ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకోస్తుంది.

ఏపీటీఎస్‌ ద్వారా సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయాలకు సంబంధించిన టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం. పలు సంస్థలు టెండర్లు వేసినా రెండు సంస్థలు మాత్రమే తక్కువకు కోట్‌ చేసినట్లు తెలుస్తోంది. అందులో చెన్నైకి చెందిన జస్ట్‌ టికెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఎల్‌-1 గా నిలిచినట్టుగా సమాచారం. తక్కువ సర్వీస్ చార్జీలు తీసుకునేందుకు జస్ట్ టిక్కెట్ ముందుకు వచ్చినట్టు తెలిసింది.

AP Govt : సినిమా టికెట్ల బుకింగ్‌ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌

ఈ ప్రకారం జస్ట్ టిక్కెట్‌కు ఏపీ ప్రభుత్వ అధికారిక టికెట్ బుకింగ్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లుగా త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక, ఏప్రిల్ నుంచే ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇవాళో, రేపో సినిమా టికెట్లు విక్రయించే సంస్థ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఈ నిర్ణయంతో టికెట్‌ రేట్ల నియంత్రణతో పాటు, బ్లాక్‌ టికెట్ల విక్రయ దందాకు చెక్‌ పడనుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక పూర్తిగా టికెట్లన్నీ ఆన్‌లైన్‌లో అమ్మనున్నారు.. థియేటర్‌ బుకింగ్ కౌంటర్లలో కూడా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే విక్రయించనున్నారు.