MP Avinash : వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది.

MP Avinash : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది. సీబీఐ ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో అవినాశ్ ను విచారిస్తున్నారు. వివేక కేసులో అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కావడం ఇది నాలుగో సారి. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.
అంతకముందు తాను విచారణకు హాజరు కాలేనని ఆయన సీబీఐకి ఓ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున మంగళవారం విచారణను హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐని అవినాశ్ రెడ్డి కోరారు. అయితే దీనిపై సీబీఐ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో అవినాశ్ మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు.
MP Avinash Reddy : ఆస్తుల కోసమే వివేకా హత్య.. ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇక వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను సీబీఐ తెలంగాణ హైకోర్టు ముందు ఉంచింది. హత్య కేసుకు సబంధించిన దర్యాప్తు స్థాయి నివేదిక, హార్డ్ డిస్క్ ను 10 డాక్యుమెంట్లు, 35 సాక్షలు వాంగ్మూలాలు, వివేక రాసిన డెత్ నోట్, ఫోరెన్సిక్ నివేదిక, ఘటనాస్థలంలో ఆధారాలు చెరపకముందు తీసిన ఫోటోలు, కేసు డైరీ వివరాలను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సీబీఐ అందజేసింది.
మరోవైపు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అవినాశ్ రెడ్డిపై అరెస్టు సహా కఠిన చర్యలు తీసుకోరాదంటూ బీఐని హైకోర్టు ఆదేశించింది. పార్లమెంట్ సమావేశాల కారణంగా మంగళవారం సీబీఐ ముందు హాజరు నుంచి మినహాయించాలంటూ ఉత్తర్వులు ఇవ్వాలన్న అవినాశ్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించింది.
Viveka Murder Approver Dastagiri : వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
వివేక హత్య కేసులో విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేయాలని, కఠిన చర్యలు తీసుకోకుండా ఇకపై విచారణకు పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కె.లక్ష్మణ్, విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులపై తీర్పును వాయిదా వేశారు.