MP Gorantla Madhav : ఆటో ప్రమాదం.. తప్పు ఉందని తేలితే అధికారులపై కఠిన చర్యలు-ఎంపీ మాధవ్

అధికారుల నిర్లక్ష్యమే ఆటో ప్రమాదానికి కారణం అని విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎంపీ మాధవ్ పరిశీలించారు.(MP Gorantla Madhav)

MP Gorantla Madhav : ఆటో ప్రమాదం.. తప్పు ఉందని తేలితే అధికారులపై కఠిన చర్యలు-ఎంపీ మాధవ్

Mp Gorantla Madhav

MP Gorantla Madhav : అధికారుల నిర్లక్ష్యమే ఆటో ప్రమాదానికి కారణం అని విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎంపీ మాధవ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నాసిరకం విద్యుత్ వైర్ల కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఎంపీ మాధవ్ చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ విషయమై ఆరా తీశారని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించనున్నట్టుగా ఎంపీ మాధవ్ చెప్పారు.

”ఇది చాలా దురదృష్టకమైన ఘటన. వాళ్లంతా వ్యవసాయ కూలీలు. బుడ్డంపల్లికి చెందిన వారు. ఆటోలో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. హైటెన్షన్ వైరుపై ఉడత పారడటం, బలహీనంగా ఉన్న వైరు స్పాట్ లో తెగి ఆటో మీద పడటం, ఆటో పైనున్న ఇనుప మంచం ఉండటంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు ఆటో నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన గురించి సీఎం జగన్ కి తెలియజేశాం.

Auto Catches Fire : ఆటోపై ఇనుప మంచం, చేతికందే ఎత్తులో కరెంట్ వైర్లు.. చిల్లకొండయ్యపల్లి ఆటో ప్రమాదానికి కారణాలివే

సీఎం జగన్ వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడారు. బాధితులకు అన్ని రకాల సహాయ చర్యలను, ఆర్థిక భద్రతను ప్రభుత్వం అందిస్తుంది. ఇది పాత వైరు. అక్కడక్కడ కట్ అయినట్టుగా కనిపిస్తోంది. కట్ అయిన వైరుని ముడేశారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అధికారులు సక్రమంగా మానిటర్ చేసి ఉంటే, ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఉంటే ఈ ఘోరం జరిగుండేది కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. విచారణలో తప్ప ఉందని తేలితే.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, రైతులకు ఇబ్బంది కలగకుండా గట్టి చర్యలు అధికారులు తీసుకోవాలి” అని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.

శ్రీసత్యసాయి జిల్లా తాడిపర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద గురువారం ఉదయం ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడి ఐదుగురు కూలీలు సజీవదహనం కావడం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదం జరగడానికి ముందు రోజు రాత్రి నుండి ఈ ప్రాంతంలో నిప్పురవ్వలు పస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపోయి నిప్పురవ్వలు వస్తున్నాయని స్థానిక రైతులు వెల్లడించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు ఈదురు గాలులతో వైర్లు బలహీనపడిపోయాయని కూడా స్థానికులు చెబుతున్నారు. నాసిరకం విద్యుత్ వైర్లను ఉపయోగించారని అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

మరోవైపు హైటెన్షన్ విద్యుత్ వైరు చేతికి అందే ఎత్తులో ఉండడం కూడా ప్రమాదానికి కారణమైందని కూడా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన ఆటో కంటే ముందు రెండు మూడు ఆటోలు కూడా ఈ ప్రాంతం నుండి ముందుకు వెళ్లాయి. ఈ ఆటోల్లో ప్రయాణిస్తున్న వారు కూడా ఈ ప్రాంతంలో విద్యుత్ వైర్ల నుండి నిప్పు రవ్వలు వస్తున్న విషయాన్ని గమనించారు. కానీ ఈ విషయమై వెనుక నుండి వచ్చే వాహనదారులను అప్రమత్తం చేయలేదు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ తో పాటు 12 మంది ఉన్నారు. వారంతా వ్యవసాయ కూలీలే. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు ఆటోలోనే సజీవ దహనమయ్యారు. ఈ ఆటో నుండి ఆరుగురు బయట పడ్డారు. మృతులు గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామస్తులు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి, కుమారిగా గుర్తించారు. సజీవ దహనం కావడంతో మృతదేహలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.