MP Margani Bharath : గోరంట్ల మాధవ్‪ది ఫ్యాబ్రికేటెడ్ వీడియో, నిజం అని తేలితే చర్యలు- వైసీపీ ఎంపీ మార్గాని భరత్

న్యూడ్ వీడియో గోరంట్ల మాధవ్ దే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, అందరూ దాన్ని ఫ్యాబ్రికేటెడ్ వీడియోగానే పరిగణిస్తున్నారని చెప్పారు. ఆ వీడియో నిజమని తేలితే పార్టీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఎనిమిదేళ్లు అయిందన్న ఎంపీ భరత్.. ఇప్పటికీ ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైందో లేదో తెలియదన్నారు.

MP Margani Bharath : గోరంట్ల మాధవ్‪ది ఫ్యాబ్రికేటెడ్ వీడియో, నిజం అని తేలితే చర్యలు- వైసీపీ ఎంపీ మార్గాని భరత్

MP Margani Bharath : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై ఏపీలో దుమారం కొనసాగుతోంది. ఎంపీ మాధవ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇదేం పాడుం పని అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో కులాల మధ్య చిచ్చు కూడా రాజేసింది. కాగా, అది ఫేక్ వీడియో అని మాధవ్ అంటున్నారు. రాజకీయంగా తనను దెబ్బకొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీని వెనుక టీడీపీ, జనసేన నేతల హస్తం ఉందంటున్నారు. మాధవ్ వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మాధవ్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే, నిజానిజాలు నిర్ధారణ కాకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.

Gorantla Madhav Video : ‘ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఓవర్ చేయొద్దు’..అంటూ వంగలపూడి అనితకు వైసీపీ కార్యకర్త బెదిరింపు

తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ఆయన టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. న్యూడ్ వీడియో గోరంట్ల మాధవ్ దే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, అందరూ దాన్ని ఫ్యాబ్రికేటెడ్ వీడియోగానే పరిగణిస్తున్నారని చెప్పారు. ఆ వీడియో నిజమని తేలితే పార్టీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఎనిమిదేళ్లు అయిందన్న ఎంపీ భరత్.. ఇప్పటికీ ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైందో లేదో తెలియదన్నారు.

MP Rammohan Naidu : ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం భయపడుతోంది-రామ్మోహన్ నాయుడు

”ఆ వీడియోను అంతా ఫ్యాబ్రికేటెడ్ వీడియోగానే పరిగణిస్తున్నారు. ఫ్యాబ్రికేటెడ్ వీడియోనా? రియల్ వీడియోనా? అనేది ఇంకా నిర్ధారణ కానప్పుడు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకవేళ ఆ వీడియో నిజమే అని నిర్ధారణ అయితే దానిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలో పార్టీ పరంగా కచ్చితంగా తీసుకుంటాం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఏ విధంగా అడ్డంగా దొరికిపోయారో తెలిసిందే. రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు.. ఆ వాయిస్ నాది కాదని బుకాయించారు. అది జరిగి సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ, ఇప్పటివరకు దిక్కూ మొక్కూ లేదు. ఎఫ్ఐఆర్ నమోదైందా? లేదా? కూడా తెలియదు. చిన్నవాళ్లకు అయితే ఒక చట్టం, పెద్ద వాళ్లకు అయితే మరో రకమైన చట్టమా?” అని ఎంపీ భరత్ ప్రశ్నించారు.

Vangalapudi Anitha On Madhav Video : ఎవరు లీక్ చేస్తే ఏంటి? ఆ వీడియోలో ఉన్నది నువ్వా? కాదా? మాధవ్‌పై వంగలపూడి అనిత ఫైర్