MP Raghurama: కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసిన ఎంపీ రఘురామ అనుచరులు

ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనుచరులు నేరుగా పోలీస్ నే కిడ్నాప్ చేశారు. అందరూ చూస్తుండగానే ఎంపీకి సంబంధించిన కారులో కానిస్టేబుల్ ను ఎక్కించుకుని వెళ్లారు. ఘటన జరిగిన సమయంలో మీడియా కూడా అక్కడే ఉంది.

MP Raghurama: కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసిన ఎంపీ రఘురామ అనుచరులు

MP Raghurama: ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనుచరులు నేరుగా పోలీస్ నే కిడ్నాప్ చేశారు. అందరూ చూస్తుండగానే ఎంపీకి సంబంధించిన కారులో కానిస్టేబుల్ ను ఎక్కించుకుని వెళ్లారు. ఘటన జరిగిన సమయంలో మీడియా కూడా అక్కడే ఉంది.

ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫారూఖ్ భాషాను ఎంపీ ఇంట్లో 3గంటల పాటు నిర్భందించి అతనిపై దాడి జరిపినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రఘురామ కృష్ణం రాజు ఇంట్లోనే ఉన్నట్లుగా సమాచారం.

ఎంపీ అనుచరులు 7777 కార్‌లో వచ్చి కానిస్టేబుల్‌ను లాక్కెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని భద్రతా విధుల్లో భాగంగా ఐఎస్బీ గేట్ వద్ద స్పాటర్ డ్యూటీ‌లో ఉన్న తనను లాక్కెళ్లి కారులో బలవంతంగా ఎక్కించి కిడ్నాప్ కు పాల్పడినట్లు కంప్లైంట్ చేశాడు కానిస్టేబుల్.

Read Also: సీఐడీ నోటీసులపై రఘురామ రియాక్షన్

గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.