వైసీపీలో ఉన్నా : పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం – ఎంపీ రఘురామ కృష్ణం రాజు

  • Edited By: madhu , November 23, 2019 / 08:29 AM IST
వైసీపీలో ఉన్నా : పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం – ఎంపీ రఘురామ కృష్ణం రాజు
ad

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లినట్లు, తన ఇంట్లో ఉన్నారన్న వార్తలను కొట్టిపారేశారు వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణం రాజు. పవన్‌ను తాను కలవలేదు..మాట్లాడలేదు..పవన్ అంటే ఎంతో ఇష్టం. చిరంజీవి ఫ్యామిలీ అంటే ఇష్టం. పవన్..తాను ఒకరినొకరు గౌరవించుకుంటామన్నారు. నాగబాబు..తనకు మధ్య కొన్ని మాటల యుద్ధం జరిగిందన్నారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం..రాజకీయం వేరన్నారు.

తాను ఇతర పార్టీల్లో చేరుతారన్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఏపీ రాజకీయాలో వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణంరాజు హాట్ టాపిక్. ఈయన వైసీపీకి దూరం అవుతున్నారా ? బీజేపీకి దగ్గరవుతున్నారా ? అనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. సీఎం జగన్‌కు..తనకు మధ్య ఎలాంటి దూరం లేదని, కావాలనే కొంతమంది ఇలాంటి అపోహాలు క్రియేట్ చేస్తున్నారని వివరించారు. ఆంగ్ల మాధ్యమంపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ మాట్లాడరని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా 10tv ఆయనతో ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజకీయ పరిణామాలు, ఇతరత్రా విషయాలను ఆయన వెల్లడించారు. 

తెలుగు భాషని పరిరక్షించమని లోక్ సభలో అడగడం జరిగిందని, ఎక్కడైనా తాను ఇంగ్లీష్ వద్దన్నానా అని ప్రశ్నించారు. తాను మాట్లాడిన వీడియో ఫుటేజ్ సీఎం జగన్ చూశారో లేదో తనకు తెలియదన్నారు. కానీ నాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయన్నారు. నాకు సీఎంకు మధ్య గ్యాప్ పెంచడానికి కొందరు ప్రయత్నం చేశారన్నారు. వ్యాపార వేత్తగా, రాజకీయ నాయకుడిగా తనకు చాలా పరిచయాలు ఉంటాయన్న ఆయన..ఈ మధ్యకాలంలో చంద్రబాబు చాలా సార్లు ఎదురయ్యారని తెలిపారు. ఇద్దరు అప్యాయంగా మాట్లాడినట్లు..అంత మాత్రానా టీడీపీలో చేరిపోతానా ? అని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణంరాజు.
Read More : ఘోరం : ఆస్తి కోసం..తమ్ముడి తల నరికేసిన అన్న