SEC Neelam Sahni : మరో ఎన్నికల సంగ్రామం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది.

SEC Neelam Sahni : మరో ఎన్నికల సంగ్రామం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు!

Mptc

mptc zptc elections : ఏపీలో మరో ఎన్నికల సంగ్రామం రాబోతోంది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. తిరుపతిలో లోక్ సభ ఉప ఎన్నిక కూడా జరుగబోతోంది. తాజాగా..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. 2021, ఏప్రిల్ 01వ తేదీ గురువారం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే కొన్ని రోజులుగా సస్పెన్ష్ నెలకొంది. తన హయాంలో ఎన్నికలు నిర్వహించలేకపోతున్నట్లు ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

2021, మార్చి 31వ తేదీ బుధవారం ఆయన పదవీకాలం ముగుస్తోంది. మాజీ సీఎస్ నీలం సాహ్ని కొత్తగా ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 01వ తేదీ గురువారం బాధ్యతలు తీసుకోగానే…ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం. ఏప్రిల్ 08వ తేదీన ఎన్నికలు నిర్వహించి..10వ తేదీన ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎస్ఈసీని అధికార పార్టీ కోరింది. న్యాయపరంగా చిక్కులు ఉండడంతో ఎస్ఈసీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

కరోనా కారణంగా ఎన్నికలు ఏడాది పాటు వాయిదా పడటంతో నోటిఫికేషన్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. మరోవైపు..ఏపీలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రెండంకెల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయితుంటే…ప్రస్తుతం ఈ సంఖ్య మూడెంకెలకు చేరింది. దీంతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే..వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారయంత్రాంగం మొత్తం చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.