కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నా..ముద్రగడ సంచలన నిర్ణయం

  • Published By: madhu ,Published On : July 13, 2020 / 10:18 AM IST
కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నా..ముద్రగడ సంచలన నిర్ణయం

కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన..ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది.

కాపు ఉద్యమంలో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయానని వివరించారు. కాపు ఫలాల సాధన కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నించడం జరిగిందని చెప్పుకొచ్చారు. తాను మానసికంగా దిగజారే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని, వీటితో కలత చెంది ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు.

ఉద్యమకాలంలో తను వసూలు చేసిన నిధులు వారికి పంచలేదనే దాడులు చేయిస్తున్నారని, కాపు జాతికి మంచి జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశానన్నారు. మన పెద్దలు పేరు చెప్పకుండా..పది మందితో తిట్టిస్తున్నారని వెల్లడించారు. తుని సభ, పాదయాత్ర విజయవంతం తన గొప్పతనం కాదని చెప్పిన ఆయన…నన్ను తిట్టించే వారితోనే రిజర్వేషన్లు సాధించాలని కోరుతున్నానని తెలిపారు.

ఏపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం..కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గుర్తింపు ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలో పనిచేశారు. 2014 నుంచి ఏ పార్టీలో చేరకుండా ఉన్నారు. 2016 జనవరి, 31న తూర్పుగోదావరి తునిలో కాపు ఐక్య గర్జన సబ ద్వారా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు.

తునిలోని కొత్తూరు వద్ద జరిగిన ఈ సభ నుంచి ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామని పిలుపునిచ్చారు. రోడ్లు, రైళ్ రోకోలకు పిలుపునివ్వడంతో చాలా మంది హైవేలు, రైల్వే ట్రాక్ లను దిగ్భందించారు. దీని ద్వారా విధ్వంసం చోటు చేసుకుంది. రైళ్లను దగ్ధం చేశారు. కాపు ఉద్యమం కోసం కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంట్లోనే నిరహార దీక్షలకు కూర్చున్న సంగతి తెలిసిందే.