టీటీడీకి రూ.300 కోట్ల విరాళం ఇచ్చిన శ్రీవారి భక్తుడు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానికి(టీటీడీ) ఓ భ‌క్తుడు భారీ విరాళం ప్రకటించాడు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరపనున్నారు. మరోవైపు సంజయ్ సింగ్‌ని అభినందించి టీటీడీ.

టీటీడీకి రూ.300 కోట్ల విరాళం ఇచ్చిన శ్రీవారి భక్తుడు

tirumala

mumbai devotee huge donation to ttd: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానికి(టీటీడీ) ఓ భ‌క్తుడు భారీ విరాళం ప్రకటించాడు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరపనున్నారు. మరోవైపు సంజయ్ సింగ్‌ని అభినందించి టీటీడీ.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం(మార్చి 11,2021) 49వేల 707 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.99 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. నిన్న 21వేల 638 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

సాధారణంగా తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలు సమర్పిస్తుంటారు. తమ కోరికలు నెరవేరడంతో విలువైన కానుకలు సమర్చించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పటికే స్వామివారికి ఎన్నో విలువైన కానుకలు అందాయి. అందులో బంగారం, వజ్ర వైడుర్యాలు ఉన్నాయి.