ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికలు..బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎలక్షన్స్

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఉదయం 6 గంటలకే పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్‌ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికలు..బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎలక్షన్స్

AP Municipal elections start : ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఉదయం 6 గంటలకే పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్‌ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 78 లక్షల 71 వేల 272 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

75 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అవగా చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 71 మున్సిపాలిటీల్లోని 16 వందల 34 వార్డుల్లో పోలింగ్‌ జరగనుంది. 12 కార్పొరేషన్లలో మొత్తం 671 డివిజన్లు ఉండగా వీటిలో 89 ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 582 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 7 వేల 552 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. హై కోర్టు తీర్పు కారణంగా ఏలూరు కార్పోరేషన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్నా…. చివరకు పోలింగ్‌కు అనుమతి లభించింది.

పోలింగ్‌ కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేయనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తుకు పోలీసుశాఖ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సామగ్రిని ఇప్పటికే దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాలకే చేరవేశారు. ఈనెల 14న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.