AP : ఏపీలో పన్ను కట్టకపోతే.. అంతే సంగతులు, మండిపడుతున్న విపక్ష పార్టీలు

పన్నులు కట్టకపోతే వడ్దీ వ్యాపారుల తరహాలో ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పన్ను బకాయిలు చెల్లించని వారి సామాన్లు జప్తు చేస్తామంటూ ఫ్లెక్సీలు కట్టి ప్రచారం...

AP : ఏపీలో పన్ను కట్టకపోతే.. అంతే సంగతులు, మండిపడుతున్న విపక్ష పార్టీలు

Ap Tax

AP Non Payment Of Taxes : దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో..పరోక్షంగానే పన్ను కడుతుంటారు. దుకాణంలోనే కొనే వస్తువుల నుంచి రెస్టారెంట్ లో భోజనం చేయడం వరకు పరోక్ష పన్నులు కడుతుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తుంటాయి. ఆదాయ పన్ను కావచ్చు.. ప్రత్యక్ష పన్నులు కావచ్చు. స్థానిక ప్రభుత్వాలైన నగర పాలక సంస్థ, మున్సిపాల్టీలు, పంచాయతీలు కూడా కొన్ని పనులు వసూలు చేస్తాయి.

Read More : Andhra Pradesh : పన్నులు కట్టకపోతే ఆస్తుల జప్తు చేస్తాం : మంత్రి బొత్స వార్నింగ్

ఇంటి పన్ను, కుళాయి, చెత్త .. ఇలా కొన్ని రకాలైన పన్నులు వసూలు చేస్తుంటాయి. కొంతమంది ఈ పన్నులు కట్టరు. దీంతో వారికి వారికి వడ్డీ వేసి వసూలు చేస్తుంటారు. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా.. పన్నులు వసూలు చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. పన్నులు కట్టకపోతే ఇంట్లోని వస్తువులు జప్తు చేస్తామనే హెచ్చరికలు జారీ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నుల వసూలు కోసం తూర్పు గోదావరి జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. పన్నులు కట్టకపోతే వడ్దీ వ్యాపారుల తరహాలో ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పన్ను బకాయిలు చెల్లించని వారి సామాన్లు జప్తు చేస్తామంటూ ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేయడంపై మొన్నీమధ్య కాకినాడలో వివాదం రాజుకోగా తాజాగా ఇప్పుడు అదే జిల్లాలోని పిఠాపురంలో మరో ఘటన చోటు చేసుకుంది.

Read More : Nadendla Manohar: డబ్బుల కోసం ప్రజలను పీడిస్తున్న జగన్ ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్

ఇంటిపన్ను, కుళాయి పన్ను, చెత్త పన్ను కట్టలేదని మున్సిపల్‌ అధికారులు రెండు ఇళ్లకు సీలు వేశారు. అందులో ఒకటైన 15వ వార్డు మోహన్‌నగర్‌లోని గొర్ల సత్తిబాబు ఇంటికి తాళం వేసిన ఘటన వివాదంగా మారింది. ఇంట్లో మహిళలు ఉండగానే అధికారులు గేటుకు తాళం వేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పన్ను చెల్లించేందుకు కొంత సమయం కోరినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చివరికి స్థానికులు ఆందోళనకు దిగడంతో గొర్ల సత్తిబాబు ఇంటి గేటుకు వేసిన సీల్‌ను అధికారులు తొలగించారు. ఈ ఘటనతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయ్యింది. ప్రజలను పీడిస్తున్నారంటూ విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.