కరోనా సెకండ్ వేవ్ : ఏపీ బస్సు ఎక్కాలంటే అది తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మరోసారి పడగ విప్పింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

కరోనా సెకండ్ వేవ్ : ఏపీ బస్సు ఎక్కాలంటే అది తప్పనిసరి

Must To Wear Mask To Travel In Apsrtc Bus1

APSRTC ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మరోసారి పడగ విప్పింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రయాణీకులు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని అధికారులు తెలిపారు.

అలాగే బస్ స్టేషన్లు, బస్సుల్లో శానిటైజర్లను ఏర్పాటు చేస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్ కాంప్లెక్స్‌లలోని స్టాళ్లలో మాస్క్‌లు విక్రయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అటు కండక్టర్లు, డ్రైవర్లు తప్పనిసరి కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది.

కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వైరస్‌ను కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రజలందరూ కూడా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. అటు పోలీసులు సైతం మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, భారీ జరిమానాలు సైతం విధిస్తున్నారు.