తిరుపతి రైల్వే ట్రాక్‌పై బ్లాస్ట్ ఘటనలో వీడిన మిస్టరీ..ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యం వల్లే పేలుడు

  • Published By: bheemraj ,Published On : December 8, 2020 / 09:01 PM IST
తిరుపతి రైల్వే ట్రాక్‌పై బ్లాస్ట్ ఘటనలో వీడిన మిస్టరీ..ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యం వల్లే పేలుడు

blast on Tirupati railway track : తిరుపతి రైల్వే ట్రాక్‌ వద్ద పేలుడు కేసును పోలీసులు గంటల వ్యవధిలో చేధించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకున్నారు. ట్రాక్‌ సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే ఈ పేలుడుకు కారణమన్నారు. ట్రాక్‌ పక్కనే ఉన్న ఇంజనీరింగ్‌ వర్క్స్ చేసే చిన్న కుటీర పరిశ్రమ ఉందని.. బ్యాటరీ తయారీలకు ఉపయోగించే రసాయనాన్ని నిర్లక్ష్యంగా పడేశారని తెలిపారు.



బాధితురాలు ఈ విషయం తెలియక ట్రాక్‌పై ఉన్న బాక్స్‌ను తొలగించే ప్రయత్నం చేయగా.. ఈ పేలుడు జరిగినట్టు ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు.. ఆ బాక్స్‌లో కాలం చెల్లిన మిథైల్‌ ఇథైల్‌ కీటో పెరాక్సైడ్‌ అనే రసాయనం ఉందని.. అందుకే ఇది పేలిందని ఆయన తెలిపారు.. ఈ ఘటనకు కారణమైన ఇంజనీరింగ్‌ వర్క్స్ సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామన్నారు..



తారకరామా నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. పట్టాలపై ఉన్న ఓ బాక్సును శశికళ అనే మహిళ పక్కకు లాగింది. దీంతో… భారీ శబ్ధంతో ఆ బాక్స్ పేలిపోయింది. ఈ ఘటనలో శశికళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి గంటల వ్యవధిలో పేలుడు గల కారణాలను తెలుసుకున్నారు.. అంతకుముందు ఇది ఉగ్రవాద చర్యగా భావించి… ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశామని పోలీసులు తెలిపారు.