శాసనమండలిని ఎలా రద్దు చేస్తారో చెప్పిన మైసురా

  • Published By: madhu ,Published On : January 21, 2020 / 10:22 AM IST
శాసనమండలిని ఎలా రద్దు చేస్తారో చెప్పిన మైసురా

ఏపీ పొలిటిక్స్‌లో శాసనమండలి రద్దు హీట్ తెప్పిస్తోంది. మూడు రాజధానులు, CRDA రద్దు బిల్లులను శాసనమండలిలో పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో రద్దు అంశం తెరమీదకు వచ్చింది. ప్రభుత్వానికి అధికారం ఉందా ? కేంద్ర పాత్ర ఉంటుందా ? ఇలాంటి అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై 10tv ప్రత్యేకంగా చర్చను చేపట్టింది. చర్చల్లో మాజీ మంత్రి మైసురా రెడ్డి పాల్గొన్నారు. మండలి రద్దు ఎలా చేస్తారో వివరంగా చెప్పారు. 

శాసనమండలి రద్దు చేయాలన్పప్పుడు శాసనసభలో ఒక తీర్మానం మూవ్ చేయాల్సి ఉంటుందని, సభలో హాజరైన సభ్యుల్లో 2/3 మెజార్టీ పాస్ కావాల్సి ఉంటుందని తెలిపారు. పాస్ అయిన తర్వాత పార్లమెంట్ ఆమోదింప చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర హోం మినిస్టరికీ ఇది వెళుతుందని, తీర్మానాన్ని లోక్ సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాల్సి ఉంటుందన్నారు. ఆమోదింప చేసిన అనంతరం రాష్ట్రపతి దగ్గరకు వెళుతుందన్నారు. సంతకం అయిపోతే..అప్పుడు కౌన్సిల్ రద్దు అవుతుందన్నారు. 

ఇక్కడ బీజేపీ ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సహకరించకపోతే డిలే అవుతుందన్నారు. బిల్‌ను ఎలా పాస్ చేసుకోవాల్సి ఉంటుందనే దానిపై ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తోందని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్లులను పాస్ చేసుకోవచ్చన్నారు. శాసనమండలి రద్దు అనేది ప్రభుత్వ నిర్ణయమన్నారు. ఒకటి రెండు, నెలలు అవసరం లేదని, ప్రోరోగ్ చేయడమే ఆలస్యమన్నారు.

అనంతరం ఆర్డినెన్స్ జారీ చేస్తారని వివరించారు. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. ఒత్తిడి వస్తే..కొన్ని రోజులు డిలే చేసే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీలో పాస్ అయ్యింది..కౌన్సిల్‌లో మెజార్టీ లేకపోతే..వీగిపోతుంది..లేకపోతే..సెలక్ట్ కమిటీకి వెళుతుందని..కానీ చాలా సమయం పడుతుందన్నారు. అందుకనే ప్రోరోగ్ చేసి బిల్లులను పాస్ చేయాల్సి ఉంటుందని మైసురా రెడ్డి తెలిపారు. మరి మండలి రద్దు అవుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

Read More : మండలి రద్దు అంత సులభం కాదంట..యనమల సంచలన వ్యాఖ్యలు