Chandrababu Naidu : ట్వీట్ చేసిన యువకుడు మృతి చెందాడు.. దర్యాప్తు చేయమంటే పోలీసులు ‘లవ్ లెటర్’ రాశారు – చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన దీక్ష కార్యక్రమం ముగిసింది. 36 గంటలు దీక్ష చేసిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం విరమించారు.

Chandrababu Naidu : ట్వీట్ చేసిన యువకుడు మృతి చెందాడు.. దర్యాప్తు చేయమంటే పోలీసులు ‘లవ్ లెటర్’ రాశారు – చంద్రబాబు

Chandrababu Naidu

Chandrababu Naidu : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన దీక్ష కార్యక్రమం ముగిసింది. 36 గంటలు దీక్ష చేసిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం విరమించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా పరిణామాలపై మాట్లాడారు. వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇటువంటి భౌతిక దాడులకు దిగలేదని చంద్రబాబు అన్నారు.

చదవండి : Chandrababu Gallary: మంగళగిరిలో చంద్రబాబు దీక్ష .. ఫోటో గ్యాలరీ

అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని సిద్ధాంతం ప్రకారం ఓటర్ల దగ్గరకు వెళదామని సూచించారు చంద్రబాబు. భౌతిక దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావలసిన అవసరం ఉందని, పోరాడకపోతే దాడులు పెరుగుతాయని అన్నారు. పోరాడేవారిపై కేసులు పెడతారని, పెట్టినా వెనక్కు వెనకడుగు వేయకుండా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు బాబు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని టార్గెట్‌గా చేసుకొని దాడులు చేస్తున్నారని, మద్యం ధరలపై ట్వీట్ చేసిన యువకుడు ఆరు రోజుల తర్వాత శవమై కనిపించాడని.. అతడి మృతిపై విచారణ చేయమని పోలీసులకు లేఖ రాస్తే తిరిగి వాళ్ళు తనకు లవ్ లెటర్ రాశారన్నారు చంద్రబాబు.

చదవండి : Chandrababu: దాడి జరిగిన చోటే.. చంద్రబాబు 36 గంటల దీక్ష..!

ఎన్నికల ముందు వైసీపీ ఇచ్చిన హామీలను గుర్తు చేశాడు బాబు. పోలవరం నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని, ప్రాజెక్టు పనులు నత్తనడక సాగుతున్నాయని విమర్శించారు. కరెంటు చార్జీలు తగ్గిస్తానా అన్నాడు కానీ ఇప్పుడు మోతమోగిస్తున్నాడని దుయ్యబట్టారు. నోటిమాటలు చెప్పాడు కానీ అమలు మాత్రం చేయలేదని సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు ఎక్కుపెట్టారు.

చదవండి : Chandrababu : కులాలు, మతాల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడుతోంది : చంద్రబాబు