Chandrababu: కేంద్రం చేసిన పని రాష్ట్రం చేయలేదా? -చంద్రబాబు | N Chandrababu Naidu Slashes YCP Over Petrol Price

Chandrababu: కేంద్రం చేసిన పని రాష్ట్రం చేయలేదా? -చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి జరిగిన రోజు కనబరిచిన ఆవేశం స్థానిక ఎన్నికల్లోనూ కనబరిచి వీరోచితంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు.

Chandrababu: కేంద్రం చేసిన పని రాష్ట్రం చేయలేదా? -చంద్రబాబు

Chandrababu: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి జరిగిన రోజు కనబరిచిన ఆవేశం స్థానిక ఎన్నికల్లోనూ కనబరిచి వీరోచితంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ సంధర్భంగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.

కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించిందని, చాలా రాష్ట్రాలు కేంద్రం దారిలో పన్నులను తగ్గించాయని, ఏపీలో మాత్రం ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు. చెత్త పన్ను వేస్తున్న ఈ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం కాదా? అని అన్నారు.

ఆస్తి పన్ను, నీటి పన్ను, మరుగుదొడ్ల పన్ను ఇలా అన్నింటిని పెంచేశారని అన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్నికలని టీడీపీ శ్రేణులు గుర్తించాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలని అన్నారు. ‘‘ఎన్నికలయ్యేవరకూ అవసరమైతే నేనే ఎన్నికల కమిషనర్ వద్దకు, క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడతా’’ అని తెలిపారు చంద్రబాబు.

×